calender_icon.png 18 August, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

23న పీఏసీ సమావేశం

18-08-2025 01:47:40 AM

ఎన్నికలకు వెళ్లాలా లేక కోర్టును సమయం కోరాలా?

అనే అంశంపై చర్చించే అవకాశం 

సీఎం రేవంత్‌రెడ్డితో పీసీసీ చీఫ్ మహేశ్ భేటీ

స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చ

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్ని కల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై  కాంగ్రె స్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)లో కీలక నిర్ణయం తీసుకోనున్నా రు. ఇందుకోసం ఈనెల 23న సాయం త్రం 5 గం.కు గాంధీభవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డితో ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో  పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు.

ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లతో పాటు సంస్థాగతంగా పార్టీ మరింత బలోపేతం అంశాలపై సుదీర్ఘం గా చర్చించారు. వారం క్రితమే రేవంత్‌రెడ్డితో మహేశ్‌కుమార్ సమావేశమైన ప్పుడు ఈనెల 16 లేదా 17న పీఏసీ స మావేశ నిర్వహించాలని నిర్ణయించారు. 

 అయితే రాష్ట్రంలో నెలకొన్న వర్షాలు, ఇతర కారణాల వల్ల పీఏసీ సమావేశం నిర్వహించలేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన  సమయం దగ్గర పడుతుండంటంతో.. పార్టీ, ప్రభుత్వపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.  

ఏ నిర్ణయం తీసుకుంటారో

కోర్టు ఆదేశాల మేరకు వచ్చే సెప్టెంబర్  నెలఖారులోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది, అయితే బీసీ రిజర్వేష్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎటు తేల్చకపోవడంతో ఎన్నికలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబుతున్నదనేది ఆసక్తిగా మారింది. కోర్టుకు వెళ్లి మరో గడువు కోరాలా? పార్టీ పరంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల మేరకు టికెట్ ఇవ్వాలా? అనే అంశంపై పీఏసీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అధికార పక్షం ఎన్నికలకు సై అంటుందా? కోర్డుకు వెళ్లి వాయిదా కోరుతుందా? అనేది ఉత్కంఠగా మారింది. అయితే గ్రామ పంచాయతీల్లో పాలకవర్గం లేకపోవడంతో కేంద్రం నుంచి నిధులు విడుదల కావడం లేదు. దీంతో పంచాయతీల్లోని సమస్యలు కుప్ప లు, తెప్పలుగా పేరుకుపోతున్నాయి. అంతే కాకుండా పంచాయతీ ఎన్నికలకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఆశావాహుల్లో నూ నిరూత్సాం కనబడుతోంది. ఈ నేపథ్యంలో పీఏసీ సమావేశంలో ఎలాంటి నిర్ణ యం తీసుకుంటారనేది చర్చగా మారింది.