29-01-2026 12:43:34 AM
గట్టు, జనవరి 28: భారత్ మాల రోడ్డు విస్తరణలో భాగంగా పొలాలు కోల్పోయిన రైతులకు భూ పరిహారం చెల్లించడంలో సంబంధిత భారత్ మాల ప్రాజెక్టు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం గట్టు మండలం గంగిమాన్ దొడ్డి గ్రామానికి చెందిన రైతులు భారత్ మాల రోడ్డుపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మొదట విడత డబ్బుల కొంతమేర ఇచ్చిన ఇక రెండో విడత కు సంబంధించి పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు మండిపడ్డారు.
అయితే భూ పరిహార విషయమై గతంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు.అధికారులు కేవలం హామీలకే పరిమితమ య్యా రని ఆవేదన వ్యక్తం చేశారు. భూ పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.త మకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని అన్నారు.ఇట్టి విషయమై జిల్లా ఉన్న తాధికారులు స్పందించి భూ పరిహారం అం దించాలని రైతులు విన్నవించారు. అనంతరం రోడ్డుపైనే సహపంక్తి భోజనాలు చేశారు. నిరసన తెలిపిన వారిలో రైతులు అంజనమ్మ సంతోష్ కురువ రాముడు మసూద్ భాష బుజ్జన్న తదితరులు ఉన్నారు.