calender_icon.png 8 September, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం రైతుల పడిగాపులు

02-09-2025 12:00:00 AM

నూతనకల్ సెప్టెంబర్ 1(విజయ క్రాంతి ):మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు తెల్లవారుజాము నుండి  పడిగాపులు కాస్తున్నారు.

రైతులకు యూరియా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో రైతులు తమ వ్యవసాయ పనులు వదులుకొని యూరియా కోసం నిరీక్షిస్తున్నారు.మూడు రోజులకు ఒకసారి యూరియా వచ్చిన అధికారులు మాత్రం రైతులకు ఒకటి లేదా రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. 

మునగాల, నడిగూడెం సహకార సంఘాల ఎదుట రైతుల ఆందోళన 

కోదాడ సెప్టెంబరు 1: మునగాల, నడిగూడెం సహకార సంఘాల ఎదుట యూరియా కోసం సోమవారం రైతులు ఆందోళన చేశారు. అధికారులు సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వలన మాకు అందాల్సిన యూరియా అందలేదని వాపోయారు. యూరియా సకాలంలో అందకపోవడం వలన మా విలువైన సమయం వృధా అవుతుందని, పొలం పనులపై ప్రభావం పడుతుందన్నారు. అధికారులు చొరవ తీసుకోవాలని రైతులు కోరారు.