calender_icon.png 1 November, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్దార్ పటేల్ జన్మదినాన్ని దేశంలో జాతీయ ఐక్యతా దినోత్సవం

01-11-2025 12:26:21 AM

ప్రతి ఏటా అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్

ఎల్లారెడ్డి లో 2కే రన్ నిర్వహించిన సిఐ రాజారెడ్డి

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి శివాజీ చౌక్ పోలీస్ స్టేషన్ వరకు 2కే రన్ నిర్వహించిన సిఐ రాజారెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ... భారత స్వాతంత్ర్య సమరయోధుడు, స్వతంత్ర భారతదేశపు మొదటి ఉప ప్రధాన మంత్రి, హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళులు అర్పించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్, లేదా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటామని,అన్నారు. 565 సెమీ-అటానమస్ రాచరిక రాష్ట్రాలు మరియు బ్రిటిష్ కాలం నాటి వలస రాష్ట్రాల నుండి ఐక్య భారతదేశాన్ని రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారనీ అన్నారు.ఐక్య భారతదేశం కోసం ఆయన చేసిన కృషికి గాను, సర్దార్ పటేల్ జన్మదినాన్ని ఇప్పుడు దేశంలో జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రజలు ఈ రోజును ఐక్యత కోసం పరుగులు వంటి కార్యకలాపాలతో జరుపుకుంటామని, ఈ రోజున, స్థానికులు దేశం యొక్క స్వాభావిక బలం మరియు స్థితి స్థాపకతను, గుర్తుంచుకోవాలని ప్రోత్సహించబడ్డారు.