calender_icon.png 24 November, 2025 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారీ వ్యవస్థతో రైతులు ఆగం!

19-11-2025 12:00:00 AM

దేశానికి అన్నం పెట్టే రైతన్న నేడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వ ద్దే దారుణంగా దోపిడీకి గురవుతున్నాడు. ఆరుగాలం శ్రమించి, అప్పులు చేసి పండించిన పంటలను అమ్ముకునేందుకు వస్తున్న  రైతన్నకు, ప్రస్తుతం డీసీఎంఎస్, పీఏసీఎస్ వంటి రైతు సహకార సంఘాల ఆధ్వర్యం లో జరుగుతున్న కొనుగోలు విధానం శా పంగా మారింది. ఈ వ్యవస్థ రైస్ మిల్లర్లతో కుమ్మక్కు, తరుగు పేరుతో కనీసం క్వింటాల్‌కు 3 నుంచి 5 కిలోల వరకు కోత విధి స్తూ.. తమను నిస్సిగ్గుగా నిలువుదోపిడీ చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఈ ఏడాది ప్రయోగాత్మకం పేరుతో తెస్తున్న కొత్త కొత్త నిబంధనలన్నీ పూర్తిగా రైతు నుంచి పత్తిని కొనుగోలు చేయకుండా ఉండేందుకు కుం టిసాకులు అనుసరిస్తుంది. దీంతో పత్తి కొ నుగోలుకు సంబంధించి రైతులకు తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సీసీఐ తీరు జిన్నింగ్ మిల్లు యజమానులకే కాకుండా ప్రైవేటు ట్రేడర్లకు, రైతులకు, కార్మికులకు సమస్యలు సృష్టిస్తున్నాయి. సీసీఐని నియంత్రించి రైతును ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది.

దీని వల్ల కేంద్రం ప్రకటించే పత్తి మద్ధతు ధర రైతులకు దక్కుండా పోతోంది. పత్తి రైతును నిండా ముంచేందుకు కేంద్రం అ నుసరిస్తున్న విధానాలు దోహదం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సారి పత్తి క్వింటాల్‌కు రూ. రూ.8,110గా ప్రకటించింది. ఈ పత్తిలో 8 శాతానికి మించి తేమ శాతం ఉండకూడదని నిబంధన విధించింది. తేమ శాతం ఒకటి పెరిగే కొద్ది క్విం టాల్‌కు రూ. 81 కోత విధిస్తామని స్పష్టం చేశారు. 12కు మించితే అసలు కొనుగోలు చేయమంటూ తేల్చిచెప్పారు. దీంతో రైతులు మరోదారి లేక దళారీలకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. 

నిర్లక్ష్యానికి పరాకాష్ట..

ప్రభుత్వం పేరుకే ‘దళారులకు ధాన్యం అమ్మవద్దు’ అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తుంటే, క్షేత్ర స్థాయిలో ఈ సహకార సం ఘాల సిబ్బంది, రైస్ మిల్లర్లతో కలిసి సృష్టిస్తున్న ఈ ‘కలర్ వ్యవస్థ’ (కొనుగోలు కేం ద్రాల ద్వారా జరిగే అనధికారిక కటింగ్ వ్యవస్థ) నిజమైన దళారీ వ్యవస్థ కంటే ప్రమాదకరంగా మారింది.

రైస్ మిల్లర్లు చెప్పినట్టు వినకపోతే ధాన్యాన్ని తీసుకోవడం లేదని, ప్రభుత్వ కేంద్రాలలో నాణ్య త, తేమ పేరు చెప్పి అడ్డగోలుగా కట్ చేసి, రైతులకు చెందాల్సిన డబ్బును వీరే తరుగు పేరుతో దోచుకుంటున్నారని రైతు లు వాపోతున్నారు. ఈ ధోరణి చూస్తుంటే డీసీఎంఎస్, పీఏసీఎస్ సంస్థలే కేవలం రైస్ మిల్లర్లకు లాభాలు చేకూర్చే ఏజెంట్లుగా, పరోక్ష దళారులుగా పనిచేస్తున్నా యనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా యి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, నాణ్య త, తేమ ప్రమాణాలు సరిగ్గా ఉన్న ధాన్యా న్ని పూర్తి మద్దతు ధరకు కొనుగోలు చే యాలి.

అయితే, కొనుగోలు కేంద్రాల వద్ద రైస్ మిల్లర్ల ప్రతినిధులు, సహకార సంఘా ల సిబ్బంది కలిసి ఉద్దేశపూర్వకంగా ప్రమాణాల పేరు చెప్పి, రైతుల్లో భయాన్ని సృష్టిస్తున్నారు. ‘మీ ధాన్యం, పత్తిలో తేమ ఎక్కువ ఉంది’ అంటూ రైతులను బెదిరిస్తున్నారు. దీంతో పంటను తిరిగి తీసుకెళ్లేందు కు రవాణా ఖర్చులు భరించలేక, తరుగుకు ఒప్పుకోవడం రైతులకు అనివార్యం గా మారుతోంది. ఇది పూర్తిగా వ్యవస్థీకృతమైన మోసమని, రైతు పట్ల ప్రభుత్వ యంత్రాంగం, సహకార సంస్థల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అని రైతు నాయకులు మండిపడుతున్నారు.

దోపిడీకి కారకులెవరు?

గతంలో ఐకేపీ (ఇందిరా క్రాంతి పథ కం) కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జరిగినప్పుడు ఈ స్థాయిలో కట్టింగ్ లేదా దోపిడీ జరగలేదు. ఐకేపీ కేంద్రాలు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నడుస్తాయి. ఇవి రాజకీయ ఒత్తిళ్లకు లేదా మిల్లర్ల ప్రభావానికి దూరంగా, మరింత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పనిచేస్తాయనే బలమైన విశ్వాసం రైతుల్లో ఉం ది. కానీ, ప్రస్తుతం కొనుగోలు బాధ్యతలను స్వీకరించిన డీసీఎంఎస్, పీఏసీఎస్ సంస్థలు రాజకీయ ప్రభావంతో నడుస్తున్నాయని, ఈ సంస్థలు రైస్ మిల్లర్లతో రహ స్యంగా కుమ్మక్కు ధాన్యం నాణ్యత తనిఖీ పేరుతో ఉద్దేశపూర్వకంగా ఎక్కువ తరుగు విధించి, ఆ నష్టాన్ని రైతుల నెత్తిన మోపుతున్నారని రైతులు ఆవేదన చెందుతు న్నారు.

ఫలితంగా క్వింటాల్‌కు కనీస మద్దతు ధరలో రూ. 80 నుంచి రూ. 100 వరకు నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. ఈ రైతు సహకార సంఘాల ద్వా రా ధాన్యం కొనుగోలు చేస్తే పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందనే విషయం రాష్ర్ట ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు స్పష్టం గా తెలిసినా, మళ్లీ అవే సంస్థలకు కొనుగోలు బాధ్యతలు అప్పగించడం దారుణ మని రైతులు బాధపడుతున్నారు. రైతులకు న్యాయం జరగాలంటే, దోపిడీకి అవ కాశం లేని, పారదర్శకమైన ఐకేపీ కేంద్రాలకే ధాన్యం కొనుగోలు బాధ్యతలను తిరిగి అప్పగించాలి. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే పునరాలోచన చేయాలి.

లేదంటే  కష్టంతో పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా నిలువు దోపిడీకి గురికావా ల్సి వస్తుందని, ఈ దోపిడీని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేం ద్రాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, రాస్తారోకోలు చేపడతామని రైతు లు హెచ్చరిస్తున్నారు. అయినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా మారింది. ప్ర భుత్వ కొనుగోలు కేంద్రాలలో కటింగ్ జరుగుతుండటంతో, ‘నిజానికి మాకు ప్రభుత్వం చెల్లించే డబ్బును వీరే తరుగు పేరుతో దోచుకుంటున్నారు. అందుకే ఇ ప్పుడు మాకు అసలు దళారులు ఎవరు? డీసీఎంఎస్, పీఏసీఎస్ కౌంటర్‌లోని సిబ్బందా లేక రైస్ మిల్లర్లా అనే సందేహం మొదలైంది. 

అడ్డగోలు నిబంధనలు..

ఇక పత్తి పండించిన రైతులు తమ పంటను అమ్ముకోలేక అరిగోస పడుతున్నారు. ఈ ఏడాది పత్తిని కొనుగోలు చే సేందుకు జిన్నింగ్ మిల్లులను ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 అంటూ మూడు కేటగిరీలుగా విభజించారు. ఈ విభజన మిల్లు యజమానాల మధ్య వివక్షకు కారణమైంది. ఒక రకం మిల్లుల వద్దే ప్రస్తుతం పత్తిని కొనుగోలు చేస్తూ మిగిలిన మిల్లుల వద్ద ఇప్పటీకి కొనుగోలు ప్రక్రియను చేపట్టకపోవడంతో సీసీఐ కొనుగోలు చేసే పత్తిపై ఆధారపడిన మిల్లులు పనిలేక వెలవెలబోతున్నాయి.

దీనికి నిరసనగా కాటన్ మి లర్లు, ట్రేడర్ల అసోసియేషన్ నిరవధికంగా కొనుగోళ్ళు నిలిపివేశారు. గతంలో స్లాట్ పద్ధతిలో పత్తిని కొనుగోలు చేసే సీసీఐ ఈ సారి కొత్తగా కపాస్ యాప్‌లో ముందుగా రైతులు బుక్ చేసుకుంటేనే పత్తిని కొనుగోలు చేసే విధంగా నిబంధనలు విధిం చారు. ఇందులో కూడా కౌలు రైతులకు అవకాశం లేకుండా పోయింది. రాష్ర్టంలో మెజార్టీ కౌలు రైతులే ఉన్నారు. దీనికి తో డు అక్షర జ్ఞానం లేని మారుమూల పల్లె రైతులు ఈ యాప్‌ను వినియోగించడం అగ్నిపరీక్షే. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల నుంచి కేవలం 7 క్వింటాళ్ళ పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామంటూ కొర్రీ లు పెట్టారు.

రైతు పండించిన మిగిలిన పత్తిని దళారులకు తక్కవ ధరకు విక్రయించుకోండని పరోక్షంగా పేర్కొంటున్నారు. 12 శాతం తేమ నిబంధన రైతులకు శాపం గా మారింది. ఇప్పటికే సీసీఐ రాష్ర్టంలో పత్తి కొనుగోళ్లలో విఫలమైంది. అందుబాటులో ఉన్న 25 లక్షల టన్నుల పత్తి నిల్వల్లో కేవలం 1.20 లక్ష టన్నులే కొనుగోలు చేసింది. దీంతో రైతులకు మరోదారి లేక దళారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం మమ్మల్ని దళారుల చేతుల్లోకి తోసివేసిందంటూ రైతన్నలు ఆవేదనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతన్న పంటలపై దోపిడీ జరుగుతుందన్న విష యం తెలుసుకున్న ప్రభుత్వం.. వెంటనే జోక్యం చేసుకుని, వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 వ్యాసకర్త సెల్: 9848559863