20-11-2025 12:00:00 AM
నేటితో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు
పుస్తకం మూడు అక్షరాలే అయినప్పటికీ ఎంతో మంది కలలకు, ఉజ్వల జీవితాలకు ఆధారం. పుస్తక పఠనం మనిషిలో విజ్ఞానాన్ని పెంచుతుంది. పుస్తకం సామాన్యుని ఆయుధం. ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో .. కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అని కందుకూరి వీరేశలింగం పంతులు మాటలు నేటికీ స్ఫూర్తినిస్తాయి. పుస్తక పఠనం వల్ల సామాజిక అవగాహన, సమస్యల పరిష్కారం, శక్తిని ఇనుమడిస్తుంది. మంచి పుస్తకం జీవితాన్ని మారుస్తుంది.
సమకాలీన సమాజంలో సామాజిక, సాంకేతిక మార్పులు ఎన్ని వచ్చినా పుస్తక ప్రియులు మాత్రం తమ పఠనాసక్తిని విడువకపోవడం గొప్ప విషయం. ఈ నేపథ్యంలోనే దేశంలో ఈ నెల 14 నుంచి 20 వరకు 58వ జాతీయ గ్రంథాలయం వారోత్సవాలు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచంలో పుస్తకాలు చదివే పాఠకుల సంఖ్య మీద ఒక సంస్థ జరిపిన సర్వేలో భారత్‌లోనే పుస్తకాలు చదివేవారు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొనడం ఆసక్తి కలిగించింది.
భారతీయులు వారానికి సగటున 10.2 గంటల పాటు పుస్తక పఠనం చేస్తారని దశాబ్ధం కిందట చేసిన ఒక అధ్యయనంలో తేలింది. 2013 నాటి సర్వే ప్రకారం భారత్‌లో పుస్తక పఠనం సమయం 10.4 గంటలకు పెరిగిం ది. టీవీలు, సినిమా లు, మారుతున్న జీవనశైలి, విచ్చలవిడి ఇంటర్నె ట్ వినియోగం ఉన్నప్పటికీ పుస్తక పఠనంపై మో జు తగ్గకపోవడం గొప్ప విష యం. ఈ నేపథ్యం లో భారత్‌లో పుస్తక పఠ నం చేసే వారి సంఖ్య మరింత పెరగాలని పుస్తక ప్రియులు కోరుకుంటున్నారు.
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పుస్తక పఠనం తగ్గిపోయింది. ఆఫ్ లైన్‌లోనూ పుస్తకాలు పట్టుకుని పఠనం చేసేవారి సంఖ్య తగ్గుతూ వ స్తుం ది. అందుకే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆఫ్‌లైన్ పుస్తక పఠనం సం ఖ్యను పెంచాలనే ఉద్దేశ్యంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో భాగంగానే జాతీయ పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేసి పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలపై సెమి నార్లు, సదస్సులు, వివిధ ప్రతిభ పాటవ పోటీలు నిర్వహిస్తూ పాఠకులకు అవగాహన కల్పిస్తున్నారు.
పౌరసమాజం, స్వచ్ఛంద సంస్థలు గ్రంధాలయాల స్థాపనకు పూనుకోవాల్సిన అవసరముంది. పఠనంతో పరిజ్ఞాన పరివ్యాప్తిలో క్రియాశీలక భాగస్వాములు కావాలి. పుస్తకాలు చదివే లక్షణ వాతావరణాన్ని ప్రజల్లో కలిగించాలి. పుస్తకాలు కొని చదివే సంస్కృతిని పెంపొందించడం, పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవలు గుర్తు చేసుకోవ డం, కొత్త తరాలను పుస్తక పఠనం వైపు ఆకర్షించడం చేయాలి. ప్రపంచ పుస్తక పఠన దినోత్సవం సందర్బంగా యునెస్కో ఆశయాల సా ధన దిశ గా కృషి జరగాల్సిన అవసరముంది.
దీంతో పాటు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పౌర గ్రంధాలయాలు స్థాపనకు పూనుకోవాలి . పాఠశాల, కళా శాలల స్థాయిలో లైబ్రరీలు ఏర్పాటు చేసి ఆఫ్‌లైన్, డిజిటల్ లైబ్రరీ సహా ఆధునిక సమాచార సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. మానవ వనరుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు బహుముఖ చర్యలు చేపట్టి ‘విజ్ఞాన భారత్’ నిర్మాణానికి పటిష్ట కార్యాచరణ, ప్రణాళికతో సగ్రమైన చర్యలకు సంసిద్ధం కావాలని ఆశిద్దాం.
నేదునూరి కనకయ్య