13-09-2025 03:06:51 AM
- సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు
- నీటి నిల్వలతో పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదం
- తోర్నాల వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచనలు
సిద్దిపేట, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో రైతులు పంటల సంరక్షణలో అ ప్రమత్తంగా ఉండాలని తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సూచించారు. జిల్లాలో 17 మండలాల్లో భారీ వర్షాలు నమోదవడంతో పొలాల్లో నీటి ముంపు సమస్యలు, పురుగులు, తెగుళ్లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షాలు తగ్గిన తరువాత పంటలకు అనువైన యాజమాన్య ప ద్ధతులు పాటిస్తే నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. వరి, ప్రత్తి, మొక్కజొన్న, కంది పంటలకు సూచనలు చేశారు.
వరి పంటలో....
ప్రస్తుతం దుబ్బు దశలో ఉన్న వరి పంట పొలాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా తొలగించాలని శాస్త్రవేత్తలు సూచించారు. నీటి ముంపు కారణంగా స్పడ్ దుష్ప్రభావం, బ్యాక్టీరియా ఎండు ఆకు తెగులు, అగ్గి తె గులు వంటి సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని, వీటి నివారణ కోసం ప్లాంటమైసిన్, కార్బెండజిమ్+మ్యాంకోజేబ్, వాలిడామైసిన్, ట్రైసైక్లోజోల్ మందులను తగిన మోతాదులో పిచికారి చేయాలని సూ చించారు.
పత్తి పంటలో....
ప్రత్తి పంటలో పిండి నల్లి, ఎండు తెగులు, ఆల్టర్నేరియా మచ్చల నివారణకు తగిన మందులను వాడాలని, రసాయనిక ఎరువులను వర్షాల తరువాత పైపాటుగా వేయాల ని సూచించారు.
మొక్కజొన్నలు...
మొక్కజొన్నలో అధిక వర్షాల వలన భాస్వరం లోపం ఏర్పడి ఆకులు ఊదా రం గులోకి మారే అవకాశం ఉందని హెచ్చరి స్తూ, 19:19:19 లేదా డీఏపీ ద్రావణాలను పి చికారి చేయాలని సూచించారు. కత్తెర పురు గు, బ్యాక్టీరియా తెగుళ్ల నివారణకు అవసరమైన మందులు వాడాలని తెలిపారు.
కంది పంటలో...
కంది పంటలో ఫైటాప్తోర తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో మెటలాక్సిల్ మందును వాడాలని సూచించారు.
రాబోయే రోజుల్లో అప్రమత్తంగా ఉండాలి..
రాబోయే రెండు రోజులలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సూచన ఉన్న నేపథ్యం లో రైతులు ఈ సమయంలో పిచికారి చేయ డం తాత్కాలికంగా వాయిదా వేయాలని శాస్త్రవేత్తలు సలహా ఇచ్చారు. వర్షాల మధ్య లో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నష్టాలు తగ్గించుకోవచ్చని సూచించారు.