04-11-2025 12:00:00 AM
-నెల రోజులైనా మొక్కజొన్నలు కొనుగోలు చేయడం లేదని ధర్నా
కొల్లాపూర్ టౌన్, నవంబర్3 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో నెలరోజులైనా మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ సోమ వారం రైతులు రోడ్డెక్కారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సొసైటీ చైర్మన్, అధికారులు తూతూ మంత్రంగా కొనుగోలు కేంద్రం ప్రారంభించి మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధాన్యం మార్కె ట్‌కు వచ్చి నెల రోజులైనా కూడా మ్యాచర్ వచ్చినా కూడా పట్టించుకోవడంలేదని ఆం దోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఒక్కో రైతు నుంచి 18 క్వింటాల్ మొక్కజొన్న మాత్రమే కొనుగోలుకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రైతు ఎంత పంట పండించిన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని రైతులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మొ క్కజొన్న కొనుగోలు ప్రారంభిస్తామని హామీ రావడంతో రైతులు విరమించారు.