calender_icon.png 2 December, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం..

12-02-2025 06:23:26 PM

టిప్పర్ ఢీకొని ఒక వ్యక్తి మృతి..

గోగుబాక కల్వర్టు వద్ద ప్రధాన రహదారిపై ప్రమాదం..

చర్ల (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గోగుబాక ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమరం రాంబాబు (45) అక్కడికక్కడే మృతి చెందాడు. దుమ్ముగూడెం మండలం జెడ్ వీరభద్రారం గ్రామానికి చెందిన రాంబాబును భద్రాచలం నుంచి చర్ల వైపు వస్తున్న TG O4 T1818 నెంబర్ గల టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగమే దీనికి ప్రధాన కారణమని గ్రామస్తులు చెప్పుకొస్తున్నారు. చర్ల మండలంలో ఇసుకరాంపుల లారీలు టిప్పర్లు అతివేగంగా నడుపుతున్నట్లు పలువురు ఆరోపణలు చేస్తున్నారు.