01-12-2025 11:56:16 PM
గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్‌కుమార్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్‌కుమార్ అన్నారు. అదేవిధంగా డివిజన్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె కోరారు. ఈ మేరకు సోమవారం గాంధీనగర్ డివిజన్‌లోని పలు బస్తీల్లో ప్రజల అవసరాల మేరకు చేపట్టనున్న అభివృద్ధి పనుల కొరకు కార్పొరేటర్ పావని.. జీహెచ్‌ఎంసి ఇంజినీరింగ్ ఏఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్, వాటర్ వరక్స్ మేనేజర్ కృష్ణ మోహన్ వారి సిబ్బందితో కలిసి పలు బస్తీల్లో పర్యటించారు.
ధోభి ఘాట్, వాల్మీకినగర్, మాల బస్తీ, శాంతి యువజన సంఘం, కేవిఎన్ చారిగల్లి, వీవీగిరినగర్ బస్తీల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్‌కుమార్, బీజేపీ నేతలు మహ మూద్ మదన్మోహన్, ఆనంద్ రావు, నరసింహ, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, తరుణ్, బస్తీ వాసులు నగేష్, మల్లికార్జున్, రమేష్, మధు, కుమార్, మురళి పాల్గొన్నారు.