02-12-2025 02:27:35 AM
రామచంద్రపురం, డిసెంబర్ 1 :శేరిలింగంపల్లి నియోజకవర్గం భారతి నగర్ డివిజన్ ఓల్ ఎంఐజీ కాలనీ పొచ్చమ్మ దేవాలయం సమీపంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన శ్రీ అయ్యప్ప మహా పడి పూజ కార్యక్రమంలో పటాన్చేరు నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, కార్పొరేటర్ సింధు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి పూజలు భక్తులలో ఆధ్యాత్మిక శాంతిని, సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇటువంటి భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అయ్యప్పను కొలిచారు.