calender_icon.png 2 December, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికే పెద్దపీట

02-12-2025 01:05:40 AM

-సర్పంచ్‌లుగా మంచోళ్లను ఎన్నుకోండి 

-పదేళ్లలో వందేళ్లకు సరిపడా అభివృద్ధి 

-పాలమూరులో పసిడి పంటలు పండాలివడ్డించే వాడినే నేను.. ఎన్ని నిధులైనా ఇస్తా 

-మక్తల్ ప్రజాపాలన- ప్రజా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.1,038 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాన

నారాయణపేట. డిసెంబర్ 1 (విజయక్రాంతి) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి వాళ్లను ఎన్నుకోవాలి. ఎమ్మెల్యే, మంత్రుల వద్దకు వెళ్లి పనులు మంజూరు చేయించుకునే నాయకులను సర్పంచులుగా గెలిపించుకుంటే పల్లెలు అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.

ప్రభుత్వం ఏర్పడి  రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం మక్తల్‌లో ఏర్పాటు చేసిన  ప్రజా పాలన  ప్రజా విజయోత్సవాల సభకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. అంతకు ముందు  రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇంచార్జ్జి మంత్రి దామోదర రాజనర్సింహతో కలి సి నేరుగా మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అక్కడి నుంచి సభా వేదిక వద్దకు చేరుకుని రూ.1038 కోట్లతో  చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా విజయోత్సవాల సభలో సీఎం ప్రసంగించారు. పదేళ్లు అధికారంలో ఉంటే  అన్ని చేసుకోవచ్చు. 35 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ పంచాయతీ తెంచా ము.

వందేళ్ల నుంచి కానీ బీసీ కుల గణన చేశాం. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇస్తున్నాం. మీ పాలమూరు బిడ్డ రాష్ట్రానికి పెద్దకొడుకుగా గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ  రాష్ట్రాన్ని నడిపి స్తున్నాడని సీఎం పేర్కొన్నారు.  

పాలమూరును పట్టించుకోలే..

ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా  పాలమూరు జిల్లాను ఎవరూ పట్టించుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.  2023 డిసెంబరు 7 అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వంలో  పాలమూరు జిల్లా ప్రజలు ఆశీర్వదించి  ఓట్లు వేసి ఉమ్మడి జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేల బలగంతో పంపిస్తే తాను తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిని అయ్యానని పేర్కొన్నారు. వచ్చే పదేళ్లలో వందేళ్లకు సరిపడా జిల్లాను అభివృద్ధి చేసుకుందాం అని చెప్పారు. వడ్డించే వాడినే నేను జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవడానికి ఎన్ని నిధులైనా ఇస్తానని హామీ ఇచ్చారు. 

మక్తల్ నుంచే శ్రీకారం..

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచిన సందర్భంగా  రాష్ట్రంలో ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని క్యాబినెట్ లో నిర్ణ యం తీసుకుందని తెలిపారు.  విజయోత్సవాల తొలి సభను వెనుకబడిన మక్తల్‌లో ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీహరి కోరడం తో ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

ఉమ్మడి రా ష్ట్రంలో మన జిల్లాకు చెందిన బూర్గుల రామకృష్ణ సీఎం అయ్యారని, మళ్లీ 75 ఏళ్ల తర్వా త  మీ ఆశీర్వాదంతో పాలమూరు బిడ్డ సీ ఎం అయ్యాడని తెలిపారు.  2014లో తెచ్చి న జీవో 69ను మంజూరు చేయిస్తే గత ప్రభుత్వం తొక్కి పెట్టింది. చివరకు ఆ ప్రాజె క్టు సాధన సమితి ఏర్పాటు చేసి గొంతెత్తి నినదించింది.

ఇప్పుడు తాము ఆ ప్రాజెక్టు ను ప్రారంభించుకుంటుంటే  కోర్టులో కేసులు వేసి అడ్డుపడుతున్నారని సీఎం విమర్శించారు.  మక్తల్ నారాయణ పేట కొడంగ ల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో ఎకరాకు  14 లక్షలు సరిపోవడం లేదని మంత్రి శ్రీహరి వచ్చి అడిగి ఎకరాకు 18 లక్షలు ఆశిస్తున్నారని చెబితే తాను ఎకరాకు 20 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని  తెలిపా రు.

ఇప్పుడు 96 శాతం రైతులు ఒప్పుకుని భూములు ఇస్తున్నారన్నారు. ఈ  ప్రాజెక్టు ద్వారా లక్షా 15 వేల ఎకరాలకు నికర జలాలను వాడుకునే అవకాశం ఉందని, నా జీవితంలో మక్తల్ నారాయణ పేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రారంభం కావడం గొప్ప సంతోషం అన్నారు.  రెండేళ్ల లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయక పోతే వీపు విమానం మోత అవుతుందని దండు,గుంపులు కట్టి పనులు చేయించుకోవాలన్నారు. 

ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యం..

వడ్డించేది నేనే... ఈ ప్రాంతాన్ని పాడి పంటలతో నింపి దేశానికి ఆదర్శంగా తయా రు చేయాలి. ఇరిగేషన్ ఒక్కటే కాదు ఎడ్యుకేషన్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. పేదోడి బిడ్డకు విద్య అందించాలని ప్రతీ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను మంజూరు చేసి, ఒక్కో స్కూల్ కు రూ. 200 కోట్లు కేటాయించామని తెలిపా రు. 14 నియోజకవర్గాలకు  ఆ స్కూల్స్ ఇ చ్చామని తెలిపారు. పాలమూరు యూనివర్సిటీలో కావలసిన కోర్సులు, కాలేజీలను మంజూరు చేసుకున్నాం. ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చి జిల్లాను రాష్ట్రం, దే శానికి ఆదర్శంగా నిలుపుతామని తెలిపారు.  

తెలంగాణ రోల్ మోడల్‌గా.. 

వనపర్తి, (విజయక్రాంతి) : తెలంగాణను అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తెలిపారు.  సోమవారం వనపర్తి జిల్లా ఆత్మకూరు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి  మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన  చేశారు. రూ.15 కోట్ల వ్యయంతో ఆత్మకూరు నగర అభివృద్ధి పనులకు, రూ.15 కోట్ల వ్యయంతో అమరచింత నగర అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.

అదే విధంగా ఆత్మకూరు మున్సిపాలిటీలో  రూ.22 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 50 పడకల కమ్యూనిటీ హెల్త్  సెంటరు భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పీజేపీ క్యాంపు ఆవరణలో ఏర్పాటు చేసిన శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి కె. అరవింద్ ప్రసాద్, అర్చకులు పూర్ణకుంభంతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. 

కార్యక్రమంలో మంత్రులతో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు  జిల్లెల చిన్నారెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు గ మధుసూదన్ రెడ్డి,  వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి, గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి,  వనపర్తి జిల్లా ఎస్పీ డి. సునీత,ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ శశిధర్ పాల్గొన్నారు.