calender_icon.png 2 December, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేరళ సీఎంకు ఈడీ నోటీసులు

02-12-2025 12:51:19 AM

మసాలా బాండ్ల జారీలో ఫెమా చట్టం ఉల్లంఘనలపై జారీ పినరయ్‌కి, మాజీ మంత్రి థామస్‌కు కూడా..

తిరువనంతపురం, డిసెంబర్ 1: రూ.2000 వేల కోట్ల మసాలా బాండ్ కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో రూ.468 కోట్ల లావాదేవీలపైనే నోటీసులు పంపామని ఈడీ పేర్కొంది. సీఎం వ్యక్తిగత కార్యదర్శితోపాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్‌కు నోటీసులు అందాయి.

2019లో మసాలా బాండ్ జారీలో విదేశీ మారకపు నిర్వహణ చట్టాన్ని(ఫెమా) ఉల్లంఘించారనే ఆరోపణ లపై నోటీసులను ఈడీ జారీ చేసింది. మసాలా బాండ్లను జారీ చేసిన తొలి రాష్ట్రం కేరళ. భారత సంస్థలు విదేశాల్లో స్థానిక కరెన్సీలో కాకుండా భారత్ కరెన్సీలో వీటిని జారీ చేశాయి. ఈ బాండ్ల ద్వారా కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డు(కేఐఐఎఫ్‌బీ) రూ.2వేల కోట్ల వరకు సమీకరించింది.

తర్వాత అవి లండన్ ఎక్సేంజీకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఆ మొత్తం విలువ రూ.2,150 కోట్ల వరకు పెరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్లను సేకరించే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఈ బాండ్లను తీసుకొచ్చింది. అయితే ఈ నిధులను అక్రమంగా మళ్లించారని, ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారని ఈడీ ఆరోపిస్తోంది. 

468 కోట్ల లావాదేవీలపైనే.. 

మసాలా బాండ్ కేసుకు సంబంధించి కేరళ సీఎం పినరయ్, ఆర్థికశాఖ మాజీ మం త్రి థామస్ ఐజాక్‌కు ఈడీ షో-కాజ్ నోటీసు జారీచేసింది. రూ.468 కోట్ల మేర లావాదేవీల్లో ఫెమా చట్టం ఉల్లంఘనలకు సంబం ధించిన నోటీసును సుమారు 10 నుంచి 12 రోజుల క్రితం జారీ చేసినట్లు సమాచారం.

2019లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూపా యి విలువ కలిగిన బాండ్ల ద్వారా నిధులు సేకరించిన కేఐఐఎఫ్‌బీపై ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై సీఎం పినరయ్ వ్యక్తిగతంగా ఈడీ ముందు హాజరు కాకపోవచ్చు. కానీ ఆయన వివరణాత్మక వివరణ ను పంపే అవకాశాలు ఉన్నాయి. విదేశీ మా రక ద్రవ్య నియమాలను ఉల్లంఘించి మౌలి క సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఈ నిధులను ఉపయోగించారని ఆరోణలు ఉన్నాయి.