06-11-2025 12:32:13 AM
అశ్వాపురం, నవంబర్ 5, (విజయ క్రాంతి): అశ్వాపురం మండలం అణుశక్తినగ ర్లో ప్రశాంత్ కుమార్ మరియు మల్లేష్ అనే తండ్రి, కొడుకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపిం ది.
వివరాల ప్రకారం ఇల్లందు పట్టణానికి చెందిన తండ్రి, కొడుకులు సెంట్రల్ గవర్నమెంట్ హెవీ వాటర్ ప్లాంట్లో ఉద్యోగం ఇప్పిస్తామని అశ్వాపురం మండలానికి చెంది న కొందరు వ్యక్తులు చెప్పి 2024 జనవరి నెలలో ఏడు లక్షలు డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపంతో వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ గా, స్థానికులు వెంటనే అశ్వాపురం పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న అశ్వాపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది వారిని స్థానిక స్టేషన్ కుతరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుప్రారంభించారు.