04-09-2025 12:35:41 AM
మిస్టరీగా మారిన పిల్లల ఆచూకీ
వెల్దండ, సెప్టెంబర్ 3 : కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలు తీసుకుని ద్విచక్ర వా హనంపై బయలుదేరిన ఎరువుల దుకాణనం వ్యాపారి వెంకటేశ్వర్లు( 36) ఆత్మహ త్యకు పాల్పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో కలకలం రేపిం ది. అతని వెంట వచ్చిన ముగ్గురు పిల్లల ఆ చూకీ లేక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పెద్ద బోయినపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వ ర్లు అదే గ్రామానికి చెందిన దీప్తితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి మోక్షిత (8) రఘు వర్షిని(6) కూతుళ్లు, శివ ధర్మ (4) కుమారుడు ముగ్గురు సంతానం. ఆగస్టు 30 న సాయంత్రం పాఠశాలకు వెళ్లి వస్తున్న వా రికి వెంకటేశ్వర్లు ఎదురు వెళ్లి తిను బండారాలు ఇప్పిస్తానని ద్విచక్ర వాహనంపై పిల్ల లను ఎక్కించుకొని తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బయలుదేరాడు.
వెంకటేశ్వర్లు రాత్రి వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి అక్కడి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చే యడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేశా రు. శ్రీశైలం వైపు వెళ్లినట్లు తెలుసుకున్న కు టుంబ సభ్యలు అతని ద్విచక్ర వాహనం లో కేషన్ పరిశీలించి నాగర్ కర్నూల్ జిల్లా అ చ్చంపేట మండలం హాజీపూర్ హోటల్ వద్ద ఉన్నట్లు తెలుసుకున్నారు.
అక్కడ చిన్న కూ తురు కుమారుని హోటల్ వద్ద ఉంచి పెట్రోల్ పోసుకొస్తామని చెప్పి పెద్ద కూతు రు తీసుకొని చారకొండ మండలం జూపల్లి దాబా వరకు వచ్చినట్లు సీసీ ఫుటేజీల ఆధారంగా ఆంధ్ర పోలీసులు కుటుంబ సభ్యులు గుర్తించారు. బుధవారం ఉదయం హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై గల పె ద్దాపూర్ గ్రామ రెవెన్యూ శివాలలోని బుర్రగుంట సమీపంలోని చెట్ల మధ్యలో వెంకటే శ్వర్లు విగత జీవిగా పడి ఉండటం చూసి పరిసర ప్రాంతాల రైతులు గ్రామస్తులు వెల్దండ పోలీసులకు సమాచారం అందించారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఎస్త్స్ర కురుమూర్తి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సిసి ఫు టేజ్ ఆధారంగా ముగ్గురు చిన్నారుల ఆచూ కీ కోసం ముమ్మరంగాగాలిస్తున్నారు.