04-09-2025 12:34:30 AM
ప్రకార్డులతో నిరసన తెలిపిన ఐజేయు జిల్లా అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్ బృందం
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 3 ,(విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జర్నలిస్టుల సమస్యలపై తక్షణమే స్పందించాలని చండ్రుగొండ మండలం దామరచర్ల సీఎం సభలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టి యు డబ్ల్యూ జే ఐ జేయు జిల్లా అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్ ప్లేకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టు సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం జర్నలిస్టులను విస్మరిస్తుందని అన్నారు .
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం పది ఎకరాల భూమి కేటాయించి ఏళ్ళకేళ్ళు గడుస్తున్నా కోర్టు కేసుతో ముడి పెడుతున్నా రన్నారు. దీంతో జర్నలిస్టుల చిరకాల కోరిక అయిన సొంతింటి కల నెరవేరేలా కనబడడం లేదని అందుకే సీఎం సభలో జర్నలిస్ట్ ల సమస్య తెలిసేటట్లు శాంతియుతంగా ఫ్లకార్డులతో నిరసన తెలిపామని జిల్లా అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్ అన్నారు. నిరసన ఆపేందుకు అక్కడికి వచ్చిన పోలీసులతో కనీసం మా ఆవేదన సీఎం రేవంత్ రెడ్డికి చేర్చాలని కోరారు.
ఇప్పటికే అనేకసార్లు జిల్లా మంత్రులకు సమాచార శాఖ మంత్రివర్యులు అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సైతం విన్నవించుకున్నామని ఇప్పటికైనా వెంటనే జర్నలిస్టులకు కేటాయించిన చోట స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, జర్నలిస్టులకు అక్రిడేషన్లు సైతం వెంటనే అందించాలని కోరారు. కార్యక్రమంలో దుద్దుకూరు రామారావు, లక్ష్మణ్, ఈశ్వర్, శంకర్, నరసింహారావు, అశోక్, జానీ, వెంకట్, ఏర్పుల సుధాకర్, నాని, జంపన్న నరేష్, తదితరులు పాల్గొన్నారు.