calender_icon.png 30 January, 2026 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎఫ్‌సీఐ హమాలీల ఆందోళన

04-10-2024 12:00:00 AM

ఖమ్మం, అక్టోబర్ 3 (విజయక్రాంతి): ఖమ్మం భారత ఆహార సంస్థలో ఎంతోకాలంగా పని చేస్తున్న హమాలీలను పెద్ద ఎత్తున బదిలీ చేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపలంగా కాజీపేటకు బదిలీ చేయడం అన్యాయమని హమాలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న దాదాపు 102 మందిని అకారణంగా కాజీపేటకు బదిలీ చేశారని హమాలీలు ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటూ కుటుంబాలతో జీవిస్తున్న వారిని ఆకస్మికంగా కాజీపేటకు బదిలీ చేయడంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతారని, బదిలీలను ఆపి ఖమ్మంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.