calender_icon.png 30 January, 2026 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండాపూర్ లో ప్రియాంక మోహన్ సందడి

30-01-2026 02:25:58 AM

హైదరాబాద్, 28 జనవరి 2026: ఓజీ మూవీ ఫేమ్ , హీరోయిన్ ప్రియాంక మోహన్ కొండాపూర్ లో తళుక్కుమంది.  ప్రముఖ ఫ్యాషన్ , వెండి ఆభరణాల బ్రాండ్ అయిన కుషల్స్ సంస్థ స్టోర్ ను ఆమె ప్రారంభించింది. వ్యక్తిగతంగా తాను ధరించడానికి ఇష్టపడే బ్రాండ్ ప్రత్యేక ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా ఉందని నటి ప్రియాంక మోహన్ వ్యాఖ్యానించింది.అందరి అమ్మాయిల్లానే తనకు కూడా జ్యూవెలరీ అంటే చాలా ఇష్టమంటూ చెప్పుకొచ్చింది. ఆమెను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. కాగా  కుషల్స్ సంస్థ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 4 స్టోర్లను ప్రారంభించడం విశేషం. ఐదు వేలకు పైగా డిజైన్లతో, సొగసైన వర్క్ వేర్ , అద్భుతమైన పెళ్లి సెట్లు మరియు రోజువారీ నిత్యావసరాలు వరకు విస్తృతమైన ఆభరణాలు తమ స్టోర్ ప్రత్యేకతగా కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ మార్కెటింగ్ డైరెక్టర్ అంకిత్ గులేచా వెల్లడించారు.

యాంటిక్, కుందన్, జిర్కాన్, టెంపుల్ మరియు స్టెర్లింగ్ సిల్వర్  ఆభరణాలతో సహా విభిన్న శ్రేణి డిజైన్లను వినియోగదారులు ఇక్కడ కొనుగోలు చేయొచ్చని తెలిపారు. నెక్లెస్‌లు, చోకర్లు, చెవిరింగ్ లు , ఫింగర్ రింగ్‌లు, పెండెంట్ సెట్‌లు, బ్రాస్‌లెట్‌లు, కడాలు, మాంగ్ టికాలు మరియు బ్రోచెస్‌ల యొక్క వైవిధ్యమైన ఎంపికతో సహా విస్తృత శ్రేణి అభిరుచులు , ప్రాధాన్యతలకు అనుగుణంగా కుషల్స్ ఆభరణాలు అందిస్తుందన్నారు.సాంప్రదాయ భారతీయ సౌందర్యశాస్త్రం , సమకాలీన ఫ్యాషన్ ఎంపికలకు అనుగుణంగా ఇవి రూపొందించబడ్డాయని తెలిపారు. ఫ్యాషన్ పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ గా హైదరాబాద్ ను పేర్కొన్న ఆయన నగర ప్రజలకు మరింత విస్తృతమైన డిజైన్లను అందించడమే లక్ష్యమన్నారు.