calender_icon.png 30 January, 2026 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుట్ట గుడిలో బంగారు, వెండి డాలర్లు మాయం

30-01-2026 01:25:24 AM

నర్సన్న కన్నెయ్..

  1. విలువ 10 లక్షలకు పైనే! l
  2. వార్షిక ఆడిట్ తనిఖీల్లో వెలుగులోకి..
  3. ఏడాదికాలంగా అపహరణ? 
  4. అధికారుల పనితీరుపై విమర్శలు

సూర్యాపేట, జనవరి 29 (విజయక్రాంతి): తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రచార శాఖలో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యా ర్థం విక్రయించే సుమారు రూ.10 లక్షల విలువ చేసే బంగారం, వెండి డాలర్లు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. గతేడాది కాలంగా ఈ అపహరణ జరుగుతున్నప్పటికీ, ఆలయ అధికారులు గుర్తించకపోవడంతో వారి పనితీరుపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.

ఇటీవల నిర్వహించిన వార్షిక ఆడిట్ తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్టాక్ రిజిస్టర్‌లో వివరాలకు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న డాలర్ల సంఖ్యకు మధ్య భారీ తేడా లు ఉన్నట్లు ఆడిట్ అధికారులు గుర్తించారు. సుమారు రూ.10 లక్షలకు పైగా విలువైన బంగారు, వెండి డాలర్లు మాయమైనట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలోనే ఇంత పెద్ద మొత్తం లో ఆభరణాలు అదృశ్యం కావడం అందరిని విస్మయానికి గురి చేస్తోంది.

ఆలయ అధికారుల నిర్లక్ష్యం

ఈ వ్యవహారంలో ఆలయ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు మండిపడుతున్నారు. నిత్యం లక్షలాది రూ పాయల ఆదాయం వచ్చే దేవస్థానంలో కనీస పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలోనే డాలర్లు మాయమైనా, ఆడిట్ వరకు ఈ విషయం బయట కు రాకుండా గోప్యంగా ఉంచడం వెనుక లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తున్న ది. ప్రచార శాఖలో పనిచేస్తున్న సిబ్బంది పాత్రపై ఆరా తీస్తుండటంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమ వుతున్నట్లు సమాచారం. కాగా గతంలోనే ప్రసాదశాల పోటులోని చింతపండు చోరీ అంశంతో అభాసు పాలైన దేవస్థానం ప్రతి ష్ట తాజాగా బయటపడిన బంగారం, వెండి డాలర్ల వ్యవహారంతో మరింత పలచనయ్యే పరిస్థితి నెలకొందని భక్తులు విమర్శిస్తున్నా రు.

యాదగిరిగుట్ట దేవాలయం పాలనా అంశాలపైన, వెలుగుచూస్తున్న అక్రమాలపైన, ఉద్యోగుల పనితీరుపైన ప్రభుత్వం మరింత దృష్టి పెట్టి దేవస్థానం పాలనను గాడిలో పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాఉండగా బంగారు, వెండి డాల ర్లు మాయమయ్యాయనే ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆలయ ఈవో భవాణీశంకర్ తెలిపారు.