calender_icon.png 30 January, 2026 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ది ఒబెసిటీ కాంక్లేవ్ 2026

30-01-2026 02:26:55 AM

హైదరాబాద్, జనవరి 2026: స్థూలకాయ శాస్త్రం, చికిత్స మరియు నివారణలో ప్రపంచంలోని ప్రముఖ వృత్తిపరమైన సంస్థలలో ఒకటైన, అమెరికాకు చెందిన 'ది ఒబెసిటీ సొసైటీ  ఇటీవల భారతదేశంలో తన మొట్టమొదటి 'ది ఒబెసిటీ కాంక్లేవ్'ను నిర్వహించింది.  ప్రముఖ జాతీయ , అంతర్జాతీయ నిపుణులను ఈ సదస్సు ఒకే వేదికపైకి తెచ్చింది. రోగి-కేంద్రీకృత విధానాల ద్వారా భారతదేశంలో స్థూలకాయ సంరక్షణ భవిష్యత్తును పునరుద్ధరించడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు 'ఇన్సిగ్నియా లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్' ఆతిథ్యం ఇచ్చింది. గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ 'డాక్టర్ రెడ్డీస్' దీనికి మెడికల్ ఎడ్యుకేషన్ పార్ట్నర్‌గా వ్యవహరించింది. పెరుగుతున్న స్థూలకాయ భారం ,దాని సంబంధిత గుండె, జీవక్రియ సమస్యలను పరిష్కరించడానికి సంభాషణ, జ్ఞాన మార్పిడి మరియు క్లినికల్ సహకారాన్ని పెంపొందించడమే ఈ సదస్సు ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఉన్న ఎండోక్రినాలజిస్టులు, కార్డియాలజిస్టులు, డయాబెటాలజిస్టులు మరియు మెటబాలిక్ హెల్త్ స్పెషలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారతదేశం గణనీయమైన మెటబాలిక్ వ్యాధి భారాన్ని ఎదుర్కొంటోందని సదస్సులో పాల్గొన్న వైద్య నిపుణులు పేర్కొన్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 ప్రకారం, ప్రతి నలుగురు భారతీయులలో ఒకరు ఇప్పుడు స్థూలకాయంతో బాధపడుతున్నారనీ వెల్డించారు.. డయాబెటిస్ ఉన్న వయోజనుల సంఖ్యలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ఉందని చెప్పారు. ఈ గణాంకాలు స్థూలకాయాన్ని ఒక క్లిష్టమైన, దీర్ఘకాలిక వ్యాధిగా గుర్తించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయనీ వారు గుర్తు చేశారు. దీనికి కేవలం జీవనశైలి మార్పులే కాకుండా, సమగ్ర వైద్య విధానం కూడా అవసరమన్నారు. భారతదేశంలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో స్థూలకాయం, సంబంధిత జీవక్రియ రుగ్మతలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయనీ డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీస్ ఛైర్మన్ పద్మశ్రీ డాక్టర్ వి. మోహన్ చెప్పారు.  మారుతున్న దృక్పథాలను, వ్యక్తిగతీకరించిన, దీర్ఘకాలిక చికిత్సా వ్యూహాల అవసరాన్ని సదస్సులో పలువురు పంచుకున్నారు.