calender_icon.png 30 January, 2026 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెస్ట్రన్ యూనియన్ గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ ప్రారంభం

30-01-2026 02:27:41 AM

హైదరాబాద్, భారతదేశం, జనవరి 28, 2026 ఃఏఐకు పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు తమ సేవలను విస్తరిస్తున్నాయి. తాజాగా వెస్ట్రన్ యూనియన్ హెచ్ సీఎల్ టెక్ తో కలిసి హైదరాబాద్ లో  తమ గ్లోబల్ కాపబిటిలి సెంటర్ ను ప్రారంభించింది. హెచ్ సీఎల్ టెక్ సీఈవో , మేనేజింగ్ డైరెక్టర్ విజయ కుమార్, రెండు సంస్థలకు చెందిన సీనియర్ నాయకులతో కలిసి  వెస్ట్రన్ యూనియన్ ప్రెసిడెంట్ , సిఈవో డెవిన్ మెక్ గ్రనహన్ ప్రారంభించారు. ఈ  ఆధునిక సౌకర్యం  ఏఐ ఆధ్వర్యంలోని ఆవిష్కరణ, ప్లాట్ ఫాం ఆపరేటింగ్ మోడల్ , ఇంజనీరింగ్ శ్రేష్టత  ద్వారా వెస్ట్రన్ యూనియన్ యొక్క సేవలను వేగవంతం చేయడానికి రూపొందించారు. ఇది రెండు కంపెనీల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత శక్తివంతం చేస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

పూణె టెక్ సెంటర్ తో పాటు, GCC టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు ఆపరేషన్స్ కోసం అంతర్జాతీయ వేదికగా పనిచేనుంది. ఆధునిక చెల్లింపుల మౌళిక సదుపాయాలను ప్రోత్సహించడంతో పాటు డిజిటల్ వినియోగదారుల అనుభవాలను మెరుగుపరుస్తుందని కంపెనీలు వెల్లడించాయి.  ఈ సెంటర్ వెస్ట్రన్ యూనియన్ గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ ఒక కీలక మైలురాయిగా ఉండిపోతుందని వెస్ట్రన్ యూనియన్ ప్రెసిడెంట్ , సిఈవో డెవిన్ మెక్ గ్రనహన్ చెప్పారు. హెచ్ సీఎల్ టెక్ తో తమ వ్యూహాత్మకమైన భాగస్వామ్యం ద్వారా, చెల్లింపులకు మించి, ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఆధునిక AI సామర్థ్యాలతో కలిసి పనిచేయనున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే ఆర్థిక సేవలు మరియు జీసీసీల కోసం  టెక్నాలజీ పరివర్తను వేగవంతం చేయడంలో  హెచ్ సీఎల్ టెక్ యొక్క శక్తివంతమైన డిజిటల్, క్లౌడ్ ,  AI సామర్థ్యాలను సూచిస్తోందనీ హెచ్ సీఎల్ టెక్ సీఈవో,ఎండీ  సి. విజయకుమార్ చెప్పారు.