30-01-2026 01:41:48 AM
న్యూఢిల్లీ, జనవరి 29 : 2026--27 ఆర్థిక సంవత్సరం లో జీడీపీ వృద్ధి 6.8 నుంచి 7.2 శాతం మధ్య ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో అంచనా వేసిన 7.4 శాతం కంటే కాస్త తక్కువ. బడ్జె ట్ సమావేశాల్లో భాగంగా 2025--26 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పని తీరు, రానున్న సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లను అంచ నా వేస్తూ ఆర్థిక సర్వేను రూపొందించారు.
ఇటీవలి సంవత్సరాల్లో తీసుకున్న విధానపరమైన సంస్కరణల ప్రభావా న్ని వృద్ధి అంచనా పరిగణనలోకి తీసుకున్నట్లు సర్వేలో వివరించారు. లోక్‌సభలో ఆర్థికసర్వే ప్రవేశపెట్టిన అనంతరం సభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేశారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ సాధించిన అభివృద్ధి, ఎదురైన సవాళ్లు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు తదితర కీలక విషయాలను ఆర్థిక సర్వేలో ప్రస్తావించారు.
2026---27 ఆర్థిక సంవత్సరంలో భారత దేశ రియల్ జీడీపీ 6.8 శాతం నుంచి 7.2 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని ఆర్థిక సర్వే తేల్చింది. సుస్థిర దేశీయ డిమాం డ్, స్థూల ఆర్థిక అంశాలు సానుకూలంగా ఉండటంతో భారత ఆర్థిక ప్రగతికి ఢోకా లేదని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వే ప్రకారం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది. ప్రతికూల అంశాల ప్రాబల్యం కొనసాగుతోంది. ఫలితంగా ప్రపంచ ఆర్థిక ప్రగతి ఓ మోస్తరు కొనసాగుతుంది. స్థూలం గా చూస్తే వస్తువుల ధరలు ఈ ఏడాదిలో స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది.
ఏఐతో..
కృత్రిమ మేధాతో ఆశించిన మేర ఆర్థిక ఫలాలు అందకపోతే ఆస్తుల విలువ తరిగి ఆర్థికరంగంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. భౌగోళిక అనిశ్చితుల కారణంగా పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత నెమ్మదించవచ్చు. ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉన్నా రాబోయే రోజుల్లో ప్రతి కూలతలు పెరిగి పరిస్థితి వికటించే అవకాశం ఉందని కూడా ఆర్థిక సర్వే అంచనా.
అమెరికా సుంకాల భారం ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసిందని ఆర్థిక సర్వే తేల్చింది. సుంకాల విధింపు తరువాత జీడీపీవృద్ధి అంచనాలు తగ్గినా వాస్తవంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ప్రభు త్వం చేపట్టిన వ్యవస్థాగత మార్పులు, విధానపరమైన నిర్ణయాల కారణంగా సుంకాల భారాన్ని భారత్ తట్టుకోగలిగిందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది.
వ్యవసాయ రంగం కీలక పాత్ర..
వికసిత్ భారత్‌ను సాధించడంలో వ్యవసాయరంగం కీలకపాత్ర పోషిస్తుందని ఆర్థిక సర్వే తెలిపింది. దేశీయంగా తయారీ, ఎగుమతులు ఎలక్ట్రానిక్ రంగం వృద్ధికి దోహదం చేస్తున్నాయని సర్వే పేర్కొంది. ఇందులో మొబైల్ తయారీ కీలకమని చెప్పింది. పదేళ్లలో ఉత్పత్తి విలువ 30 రెట్లు పెరిగి రూ.18వేల కోట్ల నుం చి రూ.5.45 లక్షల కోట్లకు చేరిందని తెలిపిం ది. డిజిటల్ సేవల్లో గ్రామాలు, పట్టణాల మధ్య అంతరం తగ్గుతోందని తెలిపింది.
‘ఎఫ్టీఏల విస్తరణతో భారత్ వాణిజ్య వ్యూహానికి బలం’
భారత్--ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై గురించి ఆర్థిక సర్వే ప్రస్థావించింది. భారత్ గత కొన్ని సంవత్సరాల్లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. దీంతో ప్రపంచ అనిశ్చితుల మధ్య దేశ వాణిజ్య వ్యూహానికి బలమైన మద్దతు లభిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఒప్పందాల వల్ల ఎగుమతి సంస్థలు ఉత్పత్తిని పెంచకునే అవకాశం లభిస్తోందని పేర్కొంది.
అలాగే గ్లోబల్ వ్యాల్యూ చైన్‌లో మరింత సమగ్రంగా భాగస్వాములయ్యే అవకాశాలు పెరు గతున్నాయని సర్వే తెలిపింది. ఎగుమతి పోటీ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో రాష్ట్రస్థాయి లో అమలు కీలకమవుతోందని పేర్కొంది. ఎగుమతులపై దృష్టి పెట్టిన సంస్థలకు అవసరమైన సదుపాయాలు, నియంత్రణలో స్పష్ట త, పరిపాలనా సమన్వయం అందించడంలో రాష్ట్రాల పాత్ర అత్యంత ముఖ్యమని పేర్కొంది.
అమెరికాతో వాణిజ్య చర్చలు ముగిసే అవకాశం..
అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఈ ఏడాదిలోనే ముగిసే అవకాశం ఉందని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ పరిణామం నెలకొన్న అనిశ్చితిని తగ్గించడంలో దోహదపడవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు భారత్‌కు స్థూల ఆర్థిక ఒత్తిడిగా కాకుండా బాహ్య అనిశ్చితుల రూపంలోనే ప్రభావం చూపుతున్నాయని సర్వేపేర్కొంది. వాణి జ్య భాగస్వామ్య దేశాల్లో మందగించినవృద్ధి, టారీఫ్‌ల వల్ల వాణిజ్యంలో అంతరాయా లు, మూలధన ప్రవాహాల్లో అస్థిరత ఎ ప్పటికప్పుడు ఎగుమతులు, పెట్టుబడిదారులపై ప్రభావం చూపొచ్చ పేర్కొంది.

ఆర్థికవృద్ధి అంచనాలు ఇలా..
* -ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ స్థిరమైన వృద్ధిని సాధి స్తుందని సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది.
* 2025--26 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7.4% గా ఉంటుందని ముంద స్తు అంచనాలు పేర్కొన్నాయి.
* 2026--27 ఆర్థిక సంవత్సరంలో బలమైన స్థూల ఆర్థిక అంశాలు, వరుస నియంత్రణ సంస్కరణల వల్ల జీడీపీ వృద్ధి 6.8% నుంచి 7.2% మధ్య ఉండొచ్చని సర్వే అంచనా వేసింది.
* ‘ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల మధ్య స్థిరమైన వృద్ధి కీలకం. ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్త అవసరం, కానీ నిరాశావాదం అక్కర్లేదు. ద్రవ్యోల్బణం నియంత్ర ణలో ఉంది. ఆహార ధరల ఒత్తిడి తగ్గింది’ అని సర్వేలో పేర్కొన్నారు.
* ‘మేక్ ఇన్ ఇండియా 2.0’పై దృష్టి కేంద్రీకరించి, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, పునరుత్పాదక శక్తి రంగాలకు ప్రత్యేక ప్రో త్సాహాలు అందిస్తున్నట్లు తెలిపారు.
* డిజిటల్ ఎకానమీ.. డిజిటల్ పేమెం ట్లు, ఫిన్టెక్, ఏఐ వినియోగం వేగంగా పెరుగుతూ, భారత్‌ను ప్రపంచ స్థాయి టెక్ హబ్‌గా మలుస్తోందన్నారు.
* సౌర, వాయు, హైడ్రోజన్ వంటి గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించి, స్థిరమైన వృద్ధికి అనుకూలంగా పాలసీ మద్ద తు కొనసాగుతోందని చెప్పారు.
* మానవ కేంద్రిత సంస్కరణలు : సాంకేతిక వినియోగాన్ని విస్తరించడంలో కూడా, సంక్షేమాన్ని కాపాడే విధంగా సం స్కరణలు పూర్తిగా మానవ కేంద్రితంగానే ఉంటాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
* ప్రపంచంలో భారత స్థానం : భారతాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆశాకి రణంగా వర్ణిస్తూ, గ్లోబల్ పెట్టుబడులు, దృష్టి భారత్ వైపు మళ్లుతు న్నాయని పేర్కొన్నారు.
* డిసెంబరులో వినియోగదారుల ధర ల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 2% వద్ద ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఇది కేంద్రం నిర్దేశించిన 4% లక్ష్యం కంటే చాలా తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నామమాత్రపు జీడీపీ వృద్ధి 8% వద్ద ఉండొచ్చని అంచనా.