22-04-2025 07:23:00 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో మరణించిన డేగవత్ రమేష్ రాథోడ్ కుటుంబానికి తోటి స్నేహితులు అండగా నిలిచారు. మంగళవారం తుంగతుర్తిలో రమేష్ రాథోడ్ స్నేహితులు వారి కుటుంబ సభ్యులను కలిసి రూ.38 వేల ఆర్థిక సాయం అందించి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితులైన పెండెం శ్రీనివాస్, కటకం ఉప్పలయ్య, కునియత్ నవీన్, అంబటి శ్రీను, నాగమణి, లక్ష్మీ, ప్రమీల, ఉస్మాన్, ఆకారపు భాస్కర్, దేవేందర్, నాగయ్య, ముత్తయ్య, బ్రహ్మచారి, శ్రీరాములు, సత్యనారాయణ, విద్యాసాగర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.