calender_icon.png 2 January, 2026 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

02-01-2026 12:05:33 AM

నిజామాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలను పురస్కరించుకొని, జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో  అవగాహన కార్యక్రమాన్ని నిజామాబాద్ సిపి సాయి చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా కరపత్రాలను పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,  జి.దుర్గా ప్రమీల, జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ చేతుల మీదుగా పోస్టర్లను విడుదల చేశారు. గురువారం రోజు ప్రారంభమైన ఈ కార్యక్రమం, జనవరి 1 నుండి జనవరి 31 వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ రకాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్  కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తగా రహదారులపై ప్రయాణించ లని ఆయన ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) బస్వరెడ్డి, అదనపు డి. సి. పి (ఎ.ఆర్)  రామ్ చందర్ రావ్ జే. ఉమామహేశ్వరరావు , జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు , బి. శ్రీనివాస్, కిరణ్ కుమార్, నాగలక్ష్మి, అజయ్ కుమార్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ ఏ.సి.పి, మస్తాన్ అలీ, నిజామాబాద్ , బోధన్, ఆర్మూర్, ఏ సీ.పిల తో పాటు ట్రాఫిక్ సి.ఐ పి.ప్రసాద్. రెడ్ క్రాస్ విభాగం వారు, ఈదార్ జిల్లా మేనేజరు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.