calender_icon.png 2 January, 2026 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో పురోగతి సాధించాలి

02-01-2026 12:03:40 AM

నిజామాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): నూతన సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆకాంక్షించారు. నూతన సంవత్సరంను పురస్కరించుకుని గురువారం ఆయా శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అదనపు కలెక్టర్ ను ఆయన కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా అభివృద్ధిని కాంక్షించారు.

ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని, అనుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జెడ్పి సీఈఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజశ్రీ, డీడబ్ల్యూఓ రసూల్ బీ, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల అధికారులు నాగోరావు, నర్సయ్య, మార్కెటింగ్ శాఖ ఏ.డీ గంగవ్వ, కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు పి.శ్రీనివాస్ రావు, భాస్కర్, బాలరాజు తదితరులు అదనపు కలెక్టర్ ను కలిసి నిన్న వారిలో ఉన్నారు.