calender_icon.png 2 January, 2026 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నుమాయిష్ స్టాల్స్ ఎంపికలో అవకతవకలు

30-12-2025 12:07:58 AM

ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని విజ్ఞప్తి..

ముషీరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): నాంపల్లి నుమాయిష్‌లో స్టాల్స్ ఎంపిక అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని పలువురు స్టాల్స్ నిర్వాహకులు కోరారు. సోమవారం తెలంగాణ జన సమితి (టీజేఎస్) నాయకులతో కలిసి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో స్టాల్స్ నిర్వాహకుడు అక్బర్ అలీ, గాంధీ దర్శన్, కార్యదర్శి ప్రసాద్‌తో కలిసి టీజేఎస్ గ్రేటర్ అధ్యక్షు డు నర్సయ్య మాట్లాడారు. నుమాయిష్‌లో మొ త్తం 3 వేలకుపైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తే, అధికారిక లెక్కల్లో మాత్రం 2 వేల స్టాల్స్ మాత్రమే చూపిస్తున్నారని తెలిపారు.

మిగిలిన 1500 స్టాల్స్‌ను ఏ పద్దతిలో కేటాయిస్తున్నారో చెప్పాలన్నారు. సొసైటీ లెక్కల ప్రకారం మినిమం స్టాల్ కు రూ.1 లక్ష రెంట్ ఉంటుందని, కానీ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు అదనం గా రూ.2 నుంచి రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గత ఏడాది సొసైటీ కన్వీనర్, ప్రస్తుత స్టాల్స్ అలాట్మెంట్ అడ్వైజర్ కనుసన్నల్లోనే అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం స్టాల్స్ కేటాయింపుపై ఒక కమిటీ వేసి, విచారణ జరిపించాలన్నారు.

స్టాల్స్ కేటాయింపులో స్థానికు లకు అన్యాయం జరుగుతుందని, గోషామహల్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత కు స్టాల్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లామని, సొసైటీ సభ్యుల అవినీతి త్వరలోనే బయట పడుతుందని అన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గాంధీ దర్శన్ బిల్డింగ్‌ను ఎగ్జిబిషన్ సొసైటీ అక్రమించుకుందని గాంధీ దర్శన్ కార్యదర్శి ప్రసాద్ ఆరోపించారు.