calender_icon.png 23 December, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెల్లో పండగ వాతావరణం

23-12-2025 02:30:43 AM

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొలువుదీరిన కొత్త సర్పంచులు

గ్రామాల అభివృద్ధికి త్వరలో నిధులు: ఎమ్మెల్యే వేడ్మ

గ్రామాభివృద్ధిలో సర్పంచులే కీలకం: ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి 

బోథ్ పాలకవర్గ ప్రమాణ 

స్వీకారంలో ఉత్కంఠ...

కుమ్రంభీం ఆసిఫాబాద్/బోథ్/ఖానాపూర్/నిర్మల్/బెజ్జూర్/, డిసెంబర్ 22 (విజయ క్రాంతి): దాదాపుగా రెండు సంవత్సరాల తరువాత జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 332 మంది సర్పంచులు సోమవా రం పంచాయతీరాజ్ చట్ట ప్రకారం బాధ్యతలను స్వీకరించారు.అంతకుముందు ఆయా పంచాయతీల ప్రత్యేక అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా మూడు పంచాయతీలలో నామినేషన్లు రాకపోవడంతో 332 పం చాయతీలలోనే ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ ,ఉప సర్పంచ్ ,వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకార అనంతరం అధికారులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.భారత రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ గ్రామపంచాయతీ అభివృద్ధికి అంకితభావంతో పనిచే స్తామని ప్రజాప్రతినిధులు వెల్లడించారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం2018 ప్రకారం తమ విధులను భయము, పక్షపాతం లేకుం డా నిష్ఠతో, నిజాయితీతో నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా అందరినీ కలుపుకుని పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.

గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.  ఎమ్మెల్యే కోవలక్ష్మి,మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.పల్లె పాలన కు నాందిపడడంతో గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.సర్పంచ్ ల ప్రమాణ స్వీకారం సందర్భంగా పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది.

కొలువుదీరిన నూతన పాలకవర్గం...

సొనాల మండల మేజర్ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన బిఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి యాళ్ల బిందుజా-సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ తుల శ్రీకాంత్ తో పాటు 10 మంది వార్డు సభ్యులచే ఎంపీడీవో మహేందర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యులను పలువురు సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్‌గా యాల్ల బిందుజ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తమపై నమ్మకంతో సర్పంచ్‌గా గెలిపించినందుకు  సోనాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపా రు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, సోనాల గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ తులా శ్రీనివాస్ మాట్లాడుతూ సోనాల నూతన కార్యవర్గం ఐక్యమత్యంగా పనిచేయాలన్నారు. సోనా ల ప్రజలకు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సహకారంతో దశలవారీగా నెరవేరుస్తామన్నారు. తనపై నమ్మకం ఉంచి బలపరిచిన అభ్యర్థిని సర్పంచ్‌గా గెలిపించినందుకు సోనా ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు నాయకులు ఉన్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలి: ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి త్వరలో నిధులు మంజూరు చేయనున్నట్లు ఖానాపూర్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ ఉన్నారు. సోమవారం ఖానాపూర్ నియోజకవర్గంలోని  దస్తు రాబాద్ పెంబి తదితర మండలాల్లో సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్తఎన్నికైన పాలకవర్గం ప్రజాసమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించే బాధ్యతను తీసు కోవాలని సూచించారు. ఈ సందర్భంగా కొత్త సర్పంచులను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీనాయకులు కార్యకర్తలు ఉన్నారు.

సర్పంచుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి 

గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ రూరల్ మండ లం చిట్యాల గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన ఏను గు సుప్రియ వెంకట్‌రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, వార్డు మెంబర్లు, మండలంలోని తల్వేద గ్రామ నూతన సర్పంచ్ గుమిడ్యాల లక్ష్మీ , ఉప సర్పంచ్ దుసమూడి రాజు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎన్నికైన నూతన్ సభ్యులకు ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దిల్వార్పూర్ మండలం సిరిగాపూర్ జరిగిన ప్రమా ణ. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మేడిసెమ్మ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, మండల నాయకులు జమాల్, అనిల్, మాజీ ఎంపీపీ మౌలానా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పల్లెల్లో మార్పు కోసం పనిచేయాలి

గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలచేత ఎన్నుకోబడ్డ కొత్త పాలకవర్గ సభ్యులు సర్పంచ్ కష్టపడి పనిచేసి ప్రజల్లో మార్పు కోసం కృషి చేయాలని రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలోని ఎల్లపల్లి వివిధ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన కాంగ్రె స్ సర్పంచుల ప్రమాణ స్వీకరోత్సవానికి ముఖ్యఅతిథి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అధికారులకు ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించి మం చి పాలన అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎసిఎస్ మాజీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

సిర్పూర్ నియోజకవర్గ పరిధిలో..

సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని బెజ్జూర్, చింతలమానపల్లి, కౌటాల, సిర్పూర్ (టి), కాగజ్నగర్, పెంచికల్పేట్, దహేగాం మండలాల్లోని గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులతో స్పెషల్ ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార అనంతరం అధికారులు నూతన సర్పంచులు, ఉపసర్పంచు లు, వార్డు సభ్యులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. భారత రాజ్యాం గంపై ప్రమాణం చేస్తూ గ్రామపంచాయతీ అభివృద్ధికి పునరంకితమవుతామని ప్రజాప్రతిని ధులు తెలిపారు.

గ్రామాభివృద్ధే లక్ష్యంగా, అందరినీ కలుపుకుని పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.గ్రామ పంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు అధికారుల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. గ్రామాల్లోని సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యతగా పనిచేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొని నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.

బోథ్ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో ఉత్కంఠ..

తొలుత గైర్హాజరైన 13 మంది వార్డు సభ్యులు..

ఉప సర్పంచ్ ఎన్నిక లావాదేవీలే గైర్హాజరుకు కారణమా...?

బోథ్ మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఉత్కంఠ నెలకొంది. ప్రమాణస్వీకారానికి తొలత 13 మంది వార్డు సభ్యులు గైరాజర్ కావడంతో ప్రమాణ స్వీకారోత్సవంలో కొన్ని గంటల పాటు గందరగోళం నెలకొం ది. ఇటీవల జరిగిన 3వ విడత ఎన్నికలలో ఘన విజయం సాధించిన బోథ్ మేజర్ గ్రామపంచాయతీ తో పాటు మండల వ్యాప్తంగా ఉన్న 21 గ్రామ పంచాయతీల పాలక వర్గాలకు సోమవారం ఆయా గ్రామ పంచాయతీలలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు.

కానీ బోథ్ మేజర్ గ్రామ పంచాయతీలో ప్రమాణ స్వీకార మహోత్సవానికి మెజారిటీ వార్డు సభ్యులు తొలుత హాజరు కాలేదు. స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్ బోథ్ సర్పంచ్ గా ఎన్నికైన కుర్మే అన్నపూర్ణ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఉప సర్పంచ్ పూండ్రు విజయలక్ష్మి తోపాటు ప్రమాణ స్వీకారం కు వచ్చిన వార్డు సభ్యురాలు మహోకర్ లక్ష్మి, కొండ్లెపు భవాని లతో ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన వార్డు సభ్యడు సోహెల్ అహ్మద్, చిలుక లక్ష్మి, కరిపె శ్రీనివాస్, కట్కం సాయి కుమార్, బారే ఐశ్వర్య, మెడిచేల్మా రూప, కట్ట భూమేష్, కదం వినయ్, బిట్లింగ్ ఉమ, సొలంకి గిరిజా బా యి, రాయల్ తిరుపతి, షేక్ శాకీర్, అడిగం పద్మరావ్ లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.

ఉదయం 11 గంట లకు చేయాల్సిన ప్రమాణ స్వీకారం సభ్యు లు రాకపోవడంతో 12.30 గంటలకు వాయిదా వేశారు. అప్పటికి రాకపోవడం తో సాయంత్రం 4 గంటల వరకు వాయి దా వేస్తున్నట్లు ఎంపీడీవో ప్రకటించారు. అయినా కూడా సభ్యులు రాకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీడీవో రమేష్ హాజరైన సర్పంచ్, వార్డు మెంబర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ గైరాజరైన వార్డ్ మెంబర్లు సాయంత్రం 5 గంటల తర్వాత ప్రమాణ స్వీకారోత్సవానికి అంగీకరించడంతో అధికారులు వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా గ్రామ పంచాయతీ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని నూతన సర్పంచ్ అన్నపూర్ణ మహేందర్ అన్నారు. పాలకవర్గ సభ్యుల సహకారంతో ప్రజల సమస్యలపై  దృష్టి సారిస్తామన్నారు. తమ గెలుపుకు సహకరించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. 

జిల్లాలోనే హాట్ టాపిక్‌గా.. 

ఇదిలా ఉంటే ప్రమాణ స్వీకారానికి 13 మంది వార్డు సభ్యులు తొలుత హాజరు కాకపోవడం జిల్లాలోనే హాట్ టాపిక్ గా నిలిచింది. ఉప సర్పంచ్ అభ్యర్థి ఎన్నిక కొరకు జరిగిన లావాదేవీల కారణంగానే వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదని ప్రచారం జరిగింది. ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత గెలిచిన 16 మంది వార్డు సభ్యులలో ఒకరిని ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నారు. ఉప సర్పంచ్ గా ఎన్నుకునే క్రమంలో మిగిలిన వార్డు మెంబర్లకు తాయిలాలు ప్రకటించి, ఆ మరుసటి రోజు తాయిలాలు ప్రకటించిన వ్యక్తి మాట మార్చడంతో మిగిలిన వార్డు సభ్యులందరూ ఒక్కటై ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించారు. కానీ మధ్యవర్తులు వారిని సముదాయించడంతో తర్వాత ప్రమాణ స్వీకారానికి అంగీకరించారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  జిల్లా గ్రంధాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, కాంగ్రెస్ ఇంచార్జి ఆడే గజేందర్, మార్కెట్ చైర్మన్ గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ గొర్ల రాజు, సీనియర్ నాయకులు చట్ల ఉమేష్ కూర్మే మహేందర్ దాసు మహమ్మ ద్ రహీం  పలువురు అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.