18-07-2025 12:06:53 AM
గాజా సిటీ, జూలై 17: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తుంది. గురువారం గాజా సిటీలోని కాథోలిక్ చర్చిపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఒక్క గురువారమే ఇజ్రాయెల్ దాడుల్లో 29 మంది మరణించినట్టు అధికారులు ధ్రువీకరించారు. గత 24 గంటల వ్యవధిలో గాజాపై వివిధ ప్రాంతా ల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 93 మం ది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు.
25 మందికి గాయాలు కాగా ఆసుప త్రికి తరలించినట్టు తెలిపారు. బుధవారం ఇజ్రాయెల్ దళాలు గాజాలోని దేర్ అల్-బలాహ్ నగరంతో పాటు బురైజ్, అల్- నుసెయిరాత్ శరణార్థి శిబిరం సమీపంలోని ప్రాంతాలపై బాంబు దాడి చేసినట్టు పాలస్తీనా వార్తా సంస్థ వాఫా తెలిపింది. 2023 అక్టోబర్‌లో యుద్ధం మొదలైన నాటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 58, 573కు చేరగా.. గాయపడిన వారి సంఖ్య లక్షా 39వేలకు చేరినట్టు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ దెబ్బకు తగ్గిన సిరియా
సిరియా రాజధాని డమాస్కస్‌లో బుధవారం ఆ దేశ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై దాడుల తో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 34 మంది గాయపడ్డారు. తాజాగా ఇజ్రాయెల్ దెబ్బకు సిరియా వెనక్కి తగ్గింది. గతంలో దక్షిణ సిరియా నగరమైన స్వైదాలో ప్రభు త్వ, డ్రూజ్ ఆర్మ్‌డ్ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలపై కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సిరి యా సైన్యం దాడులకు దిగడంతో ఇజ్రాయెల్ రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్.. సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారాతో.. డ్రూజ్ కమ్యూనిటీని విడిచిపెట్టాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదు ర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మ రోవైపు దక్షిణ సిరియా నుంచి సైన్యాన్ని పూ ర్తిగా ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా హెచ్చరించారు. ఆ తరాత ఇజ్రాయెల్ సైన్యం డమాస్కస్‌లో ని గోలన్ హైట్స్ సరిహద్దులో అదనపు సై నిక మోహరింపును ప్రారంభించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సిరియన్ ప్రభుత్వ అధికారులు వెనక్కి తగ్గి డ్రూజ్ కమ్యూనిటీతో కాల్పుల విరమణ ప్రకటించారు.