calender_icon.png 6 September, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు ఓటర్ల తుది జాబితా

01-09-2025 12:48:29 AM

పంచాయతీ ఓటర్లు 18,07196

కరీంనగర్, ఆగస్టు31 (విజయ క్రాంతి): స్థానిక పోరుకు ప్రభుత్వం సిద్దమయింది. గ్రామ పంచాయతీలకు సంబంధించి ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 2న(రేపు) విడుదల చేయనుంది. ఇప్పటికే ముసాయిదా విడుదల చేసి అభ్యంతరా లను స్వీకరించారు. తుది జాబితా విడుదల కానుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల్లో మొత్తం 18,71,096 ఓటర్లు ఉన్నారు.

ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతున్నవేళ ముందుగా గ్రామాలు, వా ర్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదలవుతుండడంతో అసెంబ్లీ సమావేశాల అనంతరం స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. తొలుత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమయ్యే అవకాశం ఉంది. జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్ జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉండగా వీటి పరిధిలో 318 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

మొత్తం 2962 వార్డులు ఉన్నా యి. పురుష ఓటర్లు 2,47, 131 కాగా మహి ళా ఓటర్లు 2,60,388 మంది, ఇతరులు 12 మంది, మొత్తంగా 5,07,531 మంది ఓటర్లు ఉన్నారు. జగిత్యాల జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉండగా 385 గ్రామ పంచాయతీలు, 3,536 వార్డులు ఉన్నాయి. పురుష ఓటర్లు 2 ,89, 249 మంది కా గా, మహిళా ఓటర్లు 3,17,964 మంది, ఇతరులు 9 మంది, మొత్తం 6,07,222 మంది ఓటర్లు ఉన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాలు ఉండగా 260 గ్రామ పంచాయతీలు, 2,268 వార్డులు ఉన్నాయి. మొ త్తం 3,52,134 మంది ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో 14 మండలాలు ఉండగా 263 గ్రా మ పంచాయతీలు వాటి పరిదిలో 2,432 వార్డులు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 4,04, 209 మంది కాగా పురుష ఓటర్లు 1,98, 744 మంది, మహిళా ఓటర్లు 2,05,451 మంది, ఇతరులు 14 మంది ఉన్నారు. ఆయా జిల్లాల్లోని పంచాయతీ అధికారులు వార్డుకొక పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదించారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరగనున్నాయి.

ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల కాగానే గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. తమ పేర్లు ఉన్నాయో లేవో ఓటరు జాబితాలో చూసుకున్నారు. పలువురు తమ వార్డులు మా రాయంటూ, కొందరు తమ పేర్లు గల్లంతయ్యాయంటూ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వచ్చిన ఫిర్యాదుల సవరణ ఆధారంగా తుది జాబితాలో కొద్దిపాటి మార్పులు ఉండేఅవకాశంఉంది.