11-11-2025 01:34:03 AM
-20 జిల్లాల్లోని 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
-బరిలో 1302 మంది అభ్యర్థులు.. ఓటేయనున్న 3.7 కోట్ల ఓటర్లు
బీహార్, నవంబర్ 10: బీహార్ ఎన్నికల రెండో దశ పోలింగ్ మంగళవారం జరగనుం ది. 20 జిల్లాల్లోని మొత్తం 122 అసెంబ్లీ నియో జకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశారు. 1302 మంది అభ్యర్థులు తమ రాజకీయ రాతను పరీక్షించుకోనున్నారు. వీరి లో 136 మంది మహిళలు కూడా తమ రాజకీ య భవిష్యత్‌ను తేల్చుకోనున్నారు. మొత్తం 45,399 కేంద్రాల్లో పోలింగ్ జరుగనుంది. మొత్తం ఓటర్ల సంఖ్య 3.70 కోట్లు కాగా, -1.95 కోట్ల పురుషులు, 1.74 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు.
అతిక్లిష్టమైన బీహార్ సామాజిక వ్యవ స్థలోని వివిధ వర్గాల మద్దతును కూడగట్టేం దుకు పాలక ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటములకు ఈ చివరి దశ పోలింగ్ కీలక పరీక్ష కానుందని రాజకీయ నిపుణులు విశ్లేషి స్తున్నారు. పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల అధి కారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అంగప్రదేశ్ ప్రాంతంలోని మొత్తం మూడు జిల్లాల్లో 16 స్థానాలు, భోజ్‌పూర్ పరిధిలోని రెండు జిల్లాల్లో 11 స్థానాలు, మగధ్ పరిధిలో ని ఐదు జిల్లాల్లో 26 స్థానాలు, మిథిలాంచల్ పరిధిలోని రెండు జిల్లాల్లో 15 స్థానాలు, సీమాంచల్ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో 24 స్థానాలు, తిర్హుత్ ప్రాంతంలోని 4 జిల్లా ల్లోని 30 స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి.
అయితే వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు ఎవరిని గెలిస్తారోన ని పోటీ అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతు న్నారు. 122 సీట్లలో అభ్యర్థల భవిష్యత్ నేడు ఓటర్ల చేతిలో నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం కానున్నాయి. ఈ నెల 14న ఓట్ల కౌంటింగ్ జర గనుంది. ఈ నెల 6న 121 అసెంబ్లీ నియోజ కవర్గాల్లో నిర్వహించిన తొలిదశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 65 శాతానికి పైఆ పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. రెండో దశలో ఎన్నికలు జరగనున్న 122 సీట్లు బీహార్ మధ్య, పశ్చిమ, ఉత్తర ప్రాంతాలలో విస్తరించి ఉన్నా యి. తిర్హత్, సరన్, ఉత్తర మిథిలాంచల్ ప్రాం తాలు సాంప్రదాయకంగా బీజేపీ ఆధిపత్యం లో ఉన్నాయి. ఇందులో తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, షియోహార్, సీతామర్హి, సరన్ జిల్లాలు ఉన్నాయి.
పట్టు కోల్పోతున్న జేడీయూ భాగల్‌పూర్ ప్రాంతంలో బలమైన ఉనికి కలిగి ఉంది. మరోవైపు, మహాఘట్ బంధన్ గయా, ఔరంగాబాద్, నవాడా, జెహా నాబాద్, అర్వాల్ జిల్లాలను కలిగి ఉన్న మగధ్ ప్రాంతంలో ఆధిపత్య స్థావరాన్ని కలిగి ఉంది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు బలమైన ప్రభావం లేదు. దీంతో ఎక్కువగా దాని మిత్ర పక్షాలపై ఆధారపడుతుంది. రాజకీయంగా సున్నితమైన సీమాంచల్ ప్రాంతానికి కూడా రెండో దశలో పోలింగ్ జరుగుతుంది.
పూర్నియా, అరారి యా, కిషన్గంజ్ మరియు కతిహార్ అనే నాలు గు జిల్లాల్లో విస్తరించి ఉన్న 24 సీట్లు ఈ బీహా ర్ ఎన్నికల్లో పెద్ద యుద్ధభూమిగా ఉంది. బీహా ర్‌లోని 17 శాతం ముస్లిం జనాభాను సీమాం చల్ జిల్లాలు కలిగి ఉన్నాయి. 2020 ఎన్నిక ల్లో, ఈ 122 సీట్లలో బీజేపీ 42 గెలుచుకుంది. ఆర్జేడీ 33, జేడీయూ20, కాంగ్రెస్11, వామ పక్షాలు 5 సీట్లను కైవసం చేసుకున్నాయి. 2015 ఎన్నికల్లో (జేడీయూ, ఆర్జేడీ మిత్రప క్షాలుగా ఉన్నప్పుడు) బీజేపీ సీట్ల సంఖ్య 36 కి పడిపోయింది. ఈ 122 సీట్లలో జేడీయూ ఆర్జేడీ కాంగ్రెస్ 80 గెలుచుకుంది.