7 April, 2026 | 2:21 AM

ఉపాధ్యాయ కుటుంబానికి ఆర్థిక సహాయం

07-04-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): పిఆర్టీయూ టీఎస్  సంఘం సంక్షే మ నిధి నుంచి వాంకిడి మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన మోతే శ్రీనివాస్ కు టుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన మోతే శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు గురువారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ చేతుల మీదుగా చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, ఉపాధ్యా యుల సంక్షేమం కోసం పిఆర్టీయూ టీఎస్ సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరీక్షల విభాగం అధికారి జనార్ధన్, పిఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సునార్కర్ అనిల్ కుమార్, గౌరవ అధ్యక్షుడు ఉప్పుల నరసింహాచారి, మండల విద్యాశాఖ అధికారి శివచరణ్ పాల్గొన్నారు.