27-12-2025 12:00:00 AM
నిజామాబాద్, డిసెంబర్ 26. (విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ 17 వ డివిజన్ చెందిన మరాఠి హారిక క్యాటరింగ్ వర్క్ చేస్తూ తన ఇంటిని నడుపుకుంటూ ఉండేది ఎప్పటిలాగే ఆర్మూర్ ఫంక్షన్‌లో క్యాటరింగ్ ముగించు కొని ఆటోలో నిజాంబాద్ వస్తుండగా అంకాపూర్ చౌరస్తా వద్దా ఆటో బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన మరాఠి హారిక హైదరాబాద్ కు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు.
కానీ వారి ఆర్థిక సోమత బాలేక కుటుంబ సభ్యులు ఇబ్బంది పడడం చూడ లేక గౌతమ్ నగర్ కు చెందిన 17 డివిజన్ మాజీ కార్పొరేటర్ మాయవార్ సాయిరాం మరియు డివిజన్ ఇంచార్జి మాయావార్ సంతోష్ ను కలవగ వారు మరాఠి హారిక తండ్రి వెంకటి గారిని ఈరోజు ఉదయం నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారి దగ్గర వెళ్లి వీరి పరిస్థితిని వివరించడం జరిగింది .
దానికి సానుకూలంగా స్పందించి ఆ కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం అందించడం జరిగింది ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారా యణ గుప్త మాట్లాడుతూ వీరి కుటుంబానికి తమ వంతు బాధ్యతగా ఎంతో కొంత సాయం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామ్ కుమార్ మరియు గోపి తదితరులు పాల్గొన్నారు