22-11-2025 12:00:00 AM
అర్మూర్, నవంబర్ 21 (విజయ క్రాంతి) : అర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన చిందుల కళాకారుడు చిందుల ఈశ్వర్ కుమారుడు రాజు అకాల మరణం చెందాడు. వీరిది నిరుపేద కుటుంబని, వీధి నాటకాలు ఆడటం వీధి. నాటకాలు లభించక వీరి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకొని చేపూర్ గ్రామానికి చెందిన చేపూర్ వాట్సాప్ గ్రూపులలో చూసి చేపూర్ గ్రామానికి చెందిన ప్రజలు, నాయకులు, ఉద్యోగులు, యువకులు, చేపూర్ ఎన్నారైలు, వ్యాపారస్తులు వారికి తోచినంత సహాయం చేశారు.
ఆర్థిక సహాయం ఫోన్ పే గూగుల్ పే ద్వారా చేయగా మొత్తం 51 వెయ్యిల రూపాయలను శుక్రవారం చేపూర్ గ్రామానికి చెందిన అంబేద్కర్ సంఘ సభ్యులు, మాజీ సొసైటీ డెరైక్టర్ సారంగి శాంతి కుమార్, మీనుగు రాజేశ్వర్, చేపూర్ విడిసి కోశాధికారి కొండ్ర రంజిత్ కుమార్, అంబేద్కర్ యూత్ సంఘం అధ్యక్షుడు మంగళారం కార్తీక్, మాజీ అంబేద్కర్ యూత్ అధ్యక్షులు సారంగీ రవి కిరణ్ ఈశ్వర్ కు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ ఉపాధ్యక్షులు, బి, సుధీర్ మంగళారం హరీష్, సారంగి అకిల్, కొనింటి అనిల్, చిందుల సురేష్ బాలేశ్వర్, రాము సత్య తదితరులు పాల్గొన్నారు.