22-11-2025 12:00:00 AM
ముత్తారం, నవంబర్21(విజయ క్రాంతి) మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవాలయంలో శుక్రవారం జాతీయ మత్యకారుల దినోత్సవ సందర్భంగా ముదిరాజ్ కులస్థులు ఘనంగా జెండా ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం గ్రామ మాజీ సర్పంచ్ తూటి రజిత రఫీ, ముత్తారం పారుపల్లి గ్రామ సొసైటీ కార్యదర్శి కుక్కల చంద్ర మౌళి, కులపెద్ద మనుషులు ఆకుల ఓదెలు, మల్యాల దేవేందర్, అధిక సంఖ్యలో ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.