06-10-2025 12:00:00 AM
మునిపల్లి, అక్టోబర్ 5 : మునిపల్లి మండలం పెద్ద గోపులారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జానీ మియా కుమారుడు కాజా ఆదివారం నాడు అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకురాలు త్రిష దామోదర రాజనర్సింహ దృష్టికి పెద్ద గోపులారం మాజీ ఎంపిటిసి పాండు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజు లు తీసుకెళ్లారు. దీంతో బాధిత కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం త్రిషమ్మ తనవంతుగా రూ. 15వేల నగదును అందించినట్టు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహకు, త్రిష దామోదర్ కు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.