calender_icon.png 6 October, 2025 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశశ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్

06-10-2025 12:00:00 AM

ఎంపీ రఘునందన్ రావు 

సిద్దిపేట, అక్టోబర్ 5 (విజయక్రాంతి):దేశ శ్రేయస్సే లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్ పనిచేస్తుందని మెద క్ ఎంపీ రఘునందన్ రావు అ న్నారు. సిద్దిపేట పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్ లో ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతజయంతి సందర్భంగా ఏర్పా టు చేసిన పదసంచాలన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మీడి యాతో మాట్లాడారు.100 సంవత్సరాలుగా ఆర్‌ఎస్‌ఎస్ దేశ అ భ్యున్నతికి పనిచేస్తూ ప్రజల కష్టసుఖాలలో పాల్గొంటుందని కొనియాడారు.

గ్రూపులుగా విడిపోయిన వామపక్షాలకు ఆర్‌ఎస్‌ఎస్ ను విమర్శించే అర్హత లేదన్నారు. జీవిత కాలంలో కూడా వామపక్ష విశ్లేషకులు సంఘ్ లో ఉన్న క్రమశిక్షణను నేర్చుకోలేరని అన్నారు. వందేళ్ల నుండి పేరు మార్చుకోకుండా ఒకే పేరుతో ఉండి దేశ నిర్మాణం కోసం పనిచేస్తున్న సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అన్నారు. దేశ సేవకు అంకితం అవుతూనే భావి భారత పౌరులను అందిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.