calender_icon.png 1 October, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుట్టు మిషన్‌తో ఆర్థిక స్వేచ్ఛ

01-10-2025 02:20:30 AM

  1. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకట్ స్వామి
  2. ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం కింద వేలాది కుట్టు మిషన్ల పంపిణీ

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): తెలంగాణలోని మైనార్టీ వర్గాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారికి స్వయం ఉపాధి కల్పించే లక్ష్యం తో ప్రజా ప్రభుత్వం మరో కీలక ముందడు గు వేసిందని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకట్ స్వామి అన్నారు.

ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం కింద రాష్ర్టవ్యాప్తంగా వేలాది కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవా రం హైదరాబాద్‌లోని హబీబ్ ఫాతిమా నగ ర్ కమ్యూనిటీ హాల్‌లో మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గత పదేళ్ల పాల నలో కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చని హామీలను ఎత్తిచూపుతూ కేసీఆర్ బాకీ కార్డులు.. పోస్టర్‌ను మంత్రులు విడుదల చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. “కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, పార్శీ లు, జైనులు వంటి మైనారిటీ వర్గాలకు చెం దిన నిరుపేద, నిరాశ్రయులైన మహిళలు, వితంతువులు, విడాకులు తీసుకున్న వారికి అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని రూపొందించాం. తొలి దశలో 10,490 కుట్టు యం త్రాలను పంపిణీ చేయగా, తాజాగా రెండో దశలో రాష్ర్టవ్యాప్తంగా మరో 33,750 కుట్టు యంత్రాల పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఒక్క హైదరాబాద్ జిల్లాకే 3,500 కుట్టు యంత్రాలను కేటాయించా రు. ఇది కేవలం జూబ్లీహిల్స్‌కు పరిమితం కాదు, రాష్ర్టంలోని 119 నియోజకవర్గాల్లో అరులైన ప్రతి మైనార్టీ మహిళకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పిస్తాం” అని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, తమ ప్రజా పాలన ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త కార్డులు మంజూరు చేయడంతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను అమలు చేస్తోందని గుర్తు చేశారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. కార్య్ర కమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమా ర్ యాదవ్, ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బెగ్ ఖాద్రి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెదుల్లా కొత్వాల్ పాల్గొన్నారు.