01-10-2025 01:08:57 AM
ప్రధాని మోదీ జీవిత ఘట్టాలను హృద్యంగా ఆవిష్కరించిన మేరా దేశ్ పహలే..
దృశ్యకావ్యంగా నాటక ప్రదర్శన
హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ జీవిత ప్రస్థానం హైదరాబాద్ వేదికగా ఆవిష్కృతమైంది. బాలీవుడ్ రచయిత, కళాకారుడు మనోజ్ ముంతాషిర్ శుక్లా రూపొందించిన ‘మేరా దేశ్ పహలే ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ నరేంద్ర మోదీ’ నాటక ప్రదర్శన మంగళవారం సాయం త్రం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించారు. గుజరాత్‌లోని వాద్‌నగర్ వీధుల నుంచి..
ఎన్నో సవాళ్లను అధిగమించి దేశ ప్రధానిగా ఎదిగే వరకు నరేంద్ర మోదీ ప్రయాణంలోని కీలక ఘట్టాలను ఈ ప్రదర్శనలో కళ్లకు కట్టారు. ముఖ్యంగా దేశ రక్షణ కోసం చేపట్టిన చారిత్రక ఆపరేషన్ సిందూర్ వంటి ఘట్టాలను భావోద్వేగభరిత నటనతో ఉత్తేజపరిచే సంగీతంతో వేదికపై పునఃసృష్టించారు. అద్భుతమైన కథనం, హృద్యమైన సంగీతంతో సాగిన ఈ దృశ్యకావ్యం ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది.
అద్భుత ప్రదర్శన
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది పూర్తిగా రాజకీయాలకు అతీతమైన కార్యక్రమమని స్ప ష్టం చేశారు. ‘ప్రధాని మోదీ గత 24 ఏళ్లు గా ముఖ్యమంత్రిగా, ప్రధానిగా విరా మం లేకుండా పనిచేస్తున్నారు. సెలవు తీసుకోకుండా ప్రతిరోజూ 18 గంటల పాటు దేశా భివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన శ్రమిస్తున్నారు.
ఆయన జీవితంలోని పట్టుదల, దేశభక్తి, దార్శనికతలను ఈ ప్రదర్శన అద్భుతంగా ఆవిష్కరించింది’ అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగర్‌రావుతో పాటు పలువురు బీజేపీ ఎంపీలు, నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.