01-10-2025 02:19:03 AM
సీపీఎస్ వద్దంటూ కేంద్ర, రాష్ట్ర పాలకులను ట్యాగ్ చేయనున్న ఎన్‌ఎంఓపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): సీపీఎస్ (కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీం), యూపీఎస్ (యూనిఫైడ్ పెన్షన్ స్కీం) వద్దు... ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీం) ముద్దు అని దేశ వ్యాప్తంగా నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంఓ పీఎస్) ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడుతు న్నట్లు ఎన్‌ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ తెలిపారు.
బుధవారం (అక్టోబర్ 1న) ఉదయం 11 గంటల నుంచి సీపీఎస్ వద్దు యూపీఎస్ వద్దు... ఓపీఎస్ ముద్దు అంటూ హాష్ ట్యాగ్‌తో ప్రధాని, కేంద్ర ఆర్థ్ధికమంత్రి, సీఎంలు, ఆర్థిక మంత్రులను ట్యాగ్ చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎక్స్ అకౌంట్ ద్వారా వినతులు తెలుపుతారని మంగళవారం తెలిపారు. టెట్ నుంచి ఉపాధ్యాయు లకు మినహాయింపు ఇవ్వాలని కోరుతామన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆయనతోపాటు సీపీఎస్ యూనియన్ నాయకులు కల్వల్ శ్రీకాంత్, నరేష్ గౌడ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.