09-10-2025 12:32:53 AM
నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్
కరీంనగర్, అక్టోబరు 8 (విజయక్రాంతి): గార్బేజ్ పాయింట్స్ తో పాటు నగర పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చెత్తను పడేసిన జరిమానాలు విధించడం జరుగుతుందని కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ అన్నారు. బుధవారం కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ ఆదేశాల మేరకు పారిశుధ్య విభాగం అధికారులు సిబ్బంది పరిసరాల్లో చెత్త వేసిన పలు దుకాణాలకు జరిమానాలు విధించారు.
నగరంలోని ఫారెస్ట్ సమీపంలో గల ఫ్రూట్ దుకాణాలతో పాటు అపరిశుభ్రత పాటిస్తున్న ఓ చికెన్ సెంటర్ కు మొత్తం 23000 రూపాయల జరిమానా విధించారు. చికెన్ సెంటర్ లో ఎలాంటి శుభ్రత లేకుండ ప్రజలకు చికెన్ విక్రయిస్తుండటంతో పారిశుధ్య విభాగం అధికారులు సిబ్బంది తనిఖీ చేపట్టారు. పూర్తిగా చికెన్ సెంటర్ తో పాటు చుట్టు ప్రక్కల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో సంబంధిత యజమానికి 20 వేల రూపాయిల జరిమానా వేశారు.
అంతే కాకుండా మరో 5 పండ్ల షాపులకు 3 వేల జరిమానా విధించారు. ఈ సంధర్బంగా కమీషనర్ మాట్లాడుతూ.... నగరంలో దుకాణా దారులు దుకాణం చుట్టు పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోవడం తో పాటు తప్పకుండ చెత్త బుట్టను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.