12-10-2025 01:28:34 AM
యుక్తి తరేజా.. ‘రంగబలి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హర్యానా అందం. ఇటీవల మలయాళ సినిమా ‘మార్కో’తో హిట్ కొట్టింది. ఇప్పుడు ‘కే ర్యాంప్’ సినిమాతో మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘కే ర్యాంప్’లో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీటీమ్ వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది.
ఇందులో భాగంగా కథానాయకి యుక్తి తరేజా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన ప్రేమ వ్యవహారం, తొలి ముద్దు గురించి ఈ అమ్మడు నిర్మొహమాటంగా చెప్పేసింది. అవన్నీ ఇంటర్ ఏజ్‌లోనే అయిపోయాయి అని ఈ బ్యూటీ చెప్పిన నాటీ ముచ్చట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ యుక్తి ఏం చెప్పిందంటే.. “నేను 11వ తరగతిలో ఉన్నప్పుడు నా సీనియర్‌తో ప్రేమలో పడ్డాను.
మేం కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత అతను ఉన్నత చదువుల కోసం అబ్రాడ్ వెళ్లాడు. దీంతో మా లవ్ బ్రేకప్ అయింది” అంటూ బుంగ మూతి పెట్టింది యువ కథానాయకి. యుక్తి తరేజా ఇంకా తన ఫస్ట్ కిస్ గురించి చెప్తూ.. ‘12వ తరగతిలో నేను ఫస్ట్ టైమ్ కిస్ చేశా’నని తెలిపింది. తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో కూడా వివరించిందీ ముద్దుగుమ్మ. “నాకు కాబోయే అబ్బాయిలో క్వాలిటీస్ గురించి చెప్పాలంటే.. అతను పొడుగ్గా ఉండాలి. నిజాయితీపరుడై ఉండాలి. నన్ను జడ్జ్ చేయకూడదు. నాతో ప్రేమగా ఉండాలి” అని తెలిపింది.