calender_icon.png 11 September, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో కోదాడ, కేఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మొదటి బహుమతి

11-09-2025 12:33:20 AM

కోదాడ సెప్టెంబర్ 10 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో  ఈనెల 8 9 నిర్వహించిన  అంతర్ జిల్లా కళాశాలల  కబడ్డీ పోటీలో కోదాడ కె ఆర్ ఆర్  ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాల డిగ్రీ విద్యార్థులు  మొదటి బహుమతిని సాధించారు.

మొత్తం 18 జట్లు పాల్గొన్న  ఈ కబడ్డీ పోటీలో  కె ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు  ఫైనల్లో  ఎన్జీ అటానమస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల జట్టుపై  విజయం సాధించి మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు.

కబడ్డీలో మొదటి బహుమతి సాధించిన విద్యార్థులను  కళాశాల ప్రిన్సిపల్  డాక్టర్ హదస రాణి మేడం బుధవారం కళాశాలలో అభి నందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్ర మంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ పి.ఫ్రాన్సిస్, అధ్యా పకుడు ఎస్. ఎం. రఫీ, కబడ్డీ కోచ్ నామా నరసిం హారావు  విద్యార్థులు పాల్గొ న్నారు