22-11-2025 12:05:59 AM
అందజేసిన ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించి న ప్రత్యేక కార్యక్రమంలో మత్స్యకారులకు ఉత్తమ మత్స్యకార ప్రతిభ అవార్డులను ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల పెంపు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న పలు కార్యక్రమాలను వివరించా రు. మత్స్యకారుల కృషి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఎంతో తోడ్పడుతోందని, ఇలాం టి సత్కారాలు వారికి మరింత ప్రోత్సాహం అం దజేస్తాయని మెట్టు సాయికుమార్ పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డైరెక్టర్ నిఖి ల, మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్, లక్ష్మీనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.