22-11-2025 12:05:45 AM
జనగామ, నవంబరు 21 (విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి నిరుపేదకి అందించే ప్రక్రియ లో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా కి వివిధ అంశాల్లో కేంద్ర, రాష్ట్ర స్థాయి లో అవార్డులు వచ్చిన నేపథ్యంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందిస్తున్న జిల్లా మీడియాకు అభినందన కార్యక్రమాన్ని కలెక్టర్ గురువారం కలెక్టరెట్ లోని కాన్ఫెరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజా మహేంద్ర నాయక్, ఆర్డీఓ వెంకన్న, డి పిఆర్ ఓ పల్లవి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.