calender_icon.png 22 December, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకారుల జీవన పోరాటం

19-10-2024 12:00:00 AM

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం  ‘సముద్రుడు’. నగేశ్ నారదాసి దర్శకత్వం లో బదావత్ కిషన్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సీనియర్ నటుడు సుమన్ ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రానికి రామోజీ జ్ఞానేశ్వర్, సోములు నాయక్ సహ నిర్మాతలు. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గురువారం ట్రైలర్‌ను విడుదల చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు మాట్లాడుతూ.. ‘సముద్రమే జీవనాధారంగా బతికే మత్స్యకారులు ప్రభుత్వ ఆంక్షలపై సాగించే జీవన పోరాటం, వారి మనో వేదనే ఈ చిత్రం’ అని తెలిపారు.