22-12-2025 12:46:31 AM
పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్21(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24న జిల్లా కేంద్రం సూర్యాపేటలోని కలెక్టరేట్ ఎదుట జరిగే నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వై వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.ఆదివారం మండల కేంద్రం అర్వపల్లితో పాటు మండల పరిధిలోని పలు గ్రామాలలో ఆసంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల,పెన్షనర్ల,కార్మికుల సంక్షేమం కోసం పనిచేయకుండా.. కేవలం కార్పొరేట్లు,కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తుందని విమర్శించారు.ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలే కాకుండా ప్రభుత్వం దగ్గర ఉద్యోగులు పొదుపు చేసి దాచుకున్న పీఎఫ్,ఎల్‌ఐసీ డబ్బులు కూడా చెల్లించకపోవడం దారుణం అన్నారు.
2024 మార్చి నుండి రిటైర్డ్ ఉద్యోగస్తుల పెండింగ్ బిల్లులను మంజూరు చేయకుండా జాప్యం చేయడం ఎంతవరకు సభవని ప్రశ్నించారు.ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఈనెల24న జరిగే నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి సోమయ్య,కోశాధికారి మన్నె యాదగిరి,నర్సయ్య,సత్యనారాయణ,రాములు,కర్ణాకర్ రెడ్డి,దేవరాజ్,ఎల్లయ్య,అంతయ్య తదితరులు పాల్గొన్నారు.