calender_icon.png 22 December, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు

22-12-2025 12:47:37 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి) డిసెంబర్ 21(విజయక్రాంతి): రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామ శివారులో నిర్మించిన అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి మహాక్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.ధనుర్మాసం మొదటి ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ఈ సందర్భంగా తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు.అనంతరం మధ్యాహ్నం యజ్ఞశాలలో మహాసౌర హోమాన్ని నిర్వహించారు.భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి,అన్నప్రసాద వితరణ జరిపారు.ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజిత జనార్దన్ స్వామి,ఘనపురం నరేష్,ఇంద్రారెడ్డి,యాదగిరి అర్చకులు భీంపాండే,అంకిత్ పాండే పాల్గొన్నారు.