calender_icon.png 22 December, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి మనసును తెలిపే కథ

19-10-2024 12:00:00 AM

ప్రేమమయిగానే కాదు త్యాగమూర్తిగానూ అమ్మకు ఎవరూ సాటి రారు. అలాంటి ఓ తల్లి మనసు ఎలాంటి భావోద్యేగాలకు గురైంది. అందుకు దారితీసిన పరిస్థితులేంటి? అనే అంశాలతో రూపొందిన చిత్రం ‘తల్లి మనసు’. ఇందులో రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులు. వీ శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమ వుతున్నారు. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై సీనియర్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు అనంత కిషోర్ నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రమిది. 

ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీకి డబ్బింగ్ కార్యక్ర మాలు సైతం పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పను లు శరవేగంగా జరుగుతున్నాయి. టీజర్ విడుదల సందర్భంగా చిత్ర సమర్పకుడు ముత్యాల సుబ్బయ్య మాట్లాడు తూ.. ‘మా బ్యానర్‌లో మంచి కథ, కథనాలతో ఓ సినిమా చేయాలని సంకల్పించి ఈ చిత్రం చేశాం. నవంబర్‌లో దీన్ని విడుదల చేస్తాం’ అని తెలిపారు.