calender_icon.png 22 December, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేకు వినతి

22-12-2025 12:46:59 AM

మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 21: నగరంలోని కొత్తచెరువు రోడ్డు ప్రాంతాల్లోని ప్రజలకు రాకపోకలకు సంబంధించి రోడ్డు నిర్మాణం తో పాటు  మంచినీళ్లు వీధిలైట్లు వివిధ సమస్యల పరిష్కారం కొరకు  ప్రాంత ప్రజలు  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ని కలిసి వినతి పత్రం సమర్పించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచేందు కు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అప్పటికప్పుడు స్పందించి సమస్య పరిష్కారాన్ని కృషి చేసిన ఎమ్మెల్యేకు ఆ ప్రాంతవాసులు ప్రత్యేకంగా కృతజ్ఞ తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు దోమ పరమేశ్వర్, శ్రీనివాసులు, సంతోష్, ప్రసాద్, రమేష్, శ్రీనివాస్, నరేష్, రమేష్, గణేష్ ఉన్నారు.