calender_icon.png 22 December, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తుతెలియని శవం లభ్యం

22-12-2025 12:45:47 AM

గోపాలపేట, డిసెంబర్21: గోపాల్ పేట మండల కేంద్రంలోని స్మశాన వాటికలో గుర్తుతెలియని శవం లభ్యమైనట్లు ఎస్త్స్ర నరేష్ కుమార్ తెలిపారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో  హైదరాబాద్ వైపు ఉన్న రహదారి పక్కన బీసీ స్మశాన వాటిక కలదు అక్కడ గుర్తు తెలియని వ్యక్తి పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీస్ బృందాలకు సమాచారం ఇవ్వడంతో ఎస్త్స్ర నరేష్ కుమార్ స్థానికులతో కలిసి స్మశాన వాటికకు వెళ్లి పరిశీలించారు.

ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇటువైపుకు మలవిసర్జన కోసం వచ్చినట్లు ఎస్త్స్ర గుర్తించారు ఆ క్రమంలోనే అతనికి విట్స్ లాంటిది రావడం పట్ల అక్కడే పడిపోయాడు ఇతన్ని ఎవరు కూడా చూడకపోవడం పట్ల ఫిట్స్ తో మృతి చెందినట్లు ఎస్త్స్ర తెలిపారు. మృతదేహాన్ని వనపర్తి ఏరియా పోస్టుమార్టంకు తరలించారు. ఈ మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే ఈ నెంబర్ 8712670614 కి సమాచారం ఇవ్వగలరని ఎస్‌ఐ తెలిపారు.